రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి కాకమ్మ కథలా..?

  • పొగిడేవారు క‌రువై త‌న‌ను తానే పొగుడుకుంటున్న చంద్ర‌బాబు
  • రాష్ట్ర హ‌క్కులు సాధించ‌డంలో బాబు పూర్తిగా విఫ‌లం
  • ప్ర‌భుత్వ ప‌రువు అసెంబ్లీ లీకేజీతో గంగ‌లో క‌లిసిపోయింది
  • చంద్ర‌బాబు త‌ప్పుల‌ను వైయ‌స్ జ‌గ‌న్‌పై రుద్దుతున్న టీడీపీ
  • ప్ర‌తిప‌క్షం వారే పైపులు క‌ట్ చేశార‌న‌డం సిగ్గుచేటు
  • వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విపరీతమైన అవినీతిమయం చేసిన సీఎం చంద్రబాబు నవ నిర్మాణ, మహా సంకల్ప దీక్ష అంటూ కాకమ్మ కథలు చెబుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు మూడేళ్లలో అవినీతి, అక్రమం, దోపిడీలను పెంపిపోషించడం తప్ప సాధించింది సున్నా అని అంబటి విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నవ నిర్మాణ దీక్షలకు వచ్చిన ప్రజలతో ప్రతిజ్ఞలు చేయించడం కాదు.. అసలు ప్రతిజ్ఞ మీరు చేయాలని చంద్రబాబుకు సూచించారు. అవినీతి అక్రమాలు మానేసి, రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలిస్తానని ప్రతిజ్ఞ చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఈ మూడు సంవత్సరాల్లో చంద్రబాబు చేసిన గొప్ప కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. గొప్పగా చెప్పుకోవడానికి ఏదైనా ఒక్క మంచిపని చేశావా.. బాబు అని నిలదీశారు. పొగిడేవారు కరువై చంద్రబాబును ఆయన్ను ఆయనే పొడుగుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు అధికారంలోకి వచ్చాక హెరిటేజ్‌ లాభాలు, ఆయన కుమారుడు మంత్రి అయ్యాడన్నారు.  కానీ రాష్ట్రానికి కావాల్సింది సాధించడంలో పూర్తిగా విఫలమయ్యాడని దుయ్యబట్టారు. దీనికి బాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏ కార్యక్రమమైనా దోపిడీ తప్ప మరొకటి లేదన్నారు. ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మిస్తామన్నారు. తాత్కాలిక అసెంబ్లీలో సీఎం ఛాంబర్‌ బాంబు ప్రూఫ్‌ అని బీరాలు పలికారు. కానీ ప్రతిపక్ష నేత ఛాంబర్‌ వాటర్‌ ప్రూఫ్గా కూడా లేదన్నారు. కేవలం 20 నిమిషాలు కురిసిన వర్షానికే నీటిమయమైందన్నారు. లీకైంది నీరు కాదని, రాష్ట్ర ప్రభుత్వ పరువు, మర్యాద గంగలో కలిసిపోయాయన్నారు. 

అసెంబ్లీ లీకేజీల్లో టీడీపీ నేత‌ల హ‌స్తం
ప్రతిపక్ష పార్టీ నేతలే వైయస్‌ జగన్‌ ఛాంబర్‌లో పైపులు కట్‌ చేశారని మంత్రులు నీచమైన మాటలు మాట్లాడడం సిగ్గుచేటని అంబటి విమర్శించారు. ఇదే కాకుండా ఇంతకు ముందు జరిగిన అనేక సంఘటనలు, ప్రభుత్వ వైఫల్యాలన్నీ వైయస్‌ జగన్‌పై రుద్ధే కుట్రాప్రయత్నం చేశారన్నారు. తునిలో రైలు తగలబడిపోతే ఆ రైలు తగలేసింది ఎవరనే విచారణ చేయకుండానే సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఇది కాపుల పనికాదు.. రాయలసీమ నుంచి వైయస్‌ జగన్‌ మనుషులు వచ్చి తగలబెట్టారని బురదజల్లారన్నారు. అంతే కాకుండా రాజధాని ప్రాంతంలో అరిటితోట్ల, షెడ్లు, వ్యవసాయ పరికరాలు తగలబడిపోతే మళ్లీ వైయస్‌ జగన్‌పై రుద్ధారని గుర్తు చేశారు. ఎందుకు తగలబడిపోయిందనే కనీస విచారణ కూడా చేయకుండా ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అదే విధంగా మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే దీని వెనుక కూడా వైయస్‌ జగన్‌ కుట్ర ఉందని పలు మార్లు పలు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏది జరిగినా వైయస్‌ జగన్‌దే బాధ్యత అనే నీచమైన పద్ధతుల్లో వెళ్తున్నారన్నారు. తుని, పంట పొలాలు తగలబెట్టడంలో టీడీపీ నేతల హస్తం ఉందని అంబటి అన్నారు. అసెంబ్లీలో నీరు కారడానికి కారణం తెలుగుదేశం పార్టీ వారు తప్ప మరొకరు కాదని పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top