చంద్రబాబే ఒక అబద్ధం..




చంద్రబాబే ఒక అబద్ధం..
రుణమాఫీ పేరు చెప్పి రైతులను మోసం చేసిన బాబు
బ్యాంక్‌ల్లో పెట్టిన బంగారంవేలానికి వెళ్తున్న దుస్థితి
రుణమాఫీ బ్యాంక్‌ల వడ్డీలకు సరిపోలేదు
చంద్రబాబుకు ఇంగితజ్ఞానం లేదు
నాలుగేళ్లలో ఒక్కపంటకైనా గిట్టుబాటు ధర కల్పించారా..
పోలవరం పూర్తయితే చెంబు కాదు చెరువు నీరు వచ్చేది
మన ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం పండుగలా జరగాలి
రైతుల ఆత్మీయ సమావేశంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే ప్రతీ మాట అబద్ధమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో ముగింపు సందర్భంగా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుడి వద్ద రైతులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతు సోదరులు తరలివచ్చారు. అనంతరం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే..
– చంద్రబాబు ప్రభుత్వం చేతిలో మోసపోయి అన్యాయమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. రుణమాఫీ చేస్తాను. బంగారం ఇంటికి తీసుకువస్తానని చెప్పిన చంద్రబాబు దారుణంగా మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావడం దేవుడెరుగు దానికి బ్యాంక్‌ల్లోనే వేలం వేస్తున్నారు. 
–చంద్రబాబు పాలనలో రైతులు బ్యాంక్‌ గడపలు ఎక్కలేని పరిస్థితి. బాబు చేసిన రుణమాఫీ రైతుల వడ్డీలకు కూడా సరిపోలేదు. టీడీపీ పాలనలో రైతులకు బ్యాంక్‌ల నుంచి రుణాలు కూడా అందడం లేదు. రుణాల సంఖ్య ప్రతి ఏడాది తగ్గుముఖం పట్టాయి. బ్యాంక్‌ల నుంచి రైతులకు ఇచ్చే రుణాలు తక్కువగా  ఇవ్వడం చంద్రబాబు పాలనలోనే చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితుల్లో లేక తక్కువ పంటలను సాగు చేస్తున్నారు. 
– ఇవన్నీ వాస్తవాలైతే చంద్రబాబు దీన్ని వక్రీకరిస్తున్నారు. రాష్ట్రం 12 శాతం, వ్యవసాయ రంగం 14 శాతం అభివృద్ధిలో నడుస్తున్నాయంటున్నారు. అబద్ధాలు చెప్పడానికైనా హద్దూ.. అదుపు ఉండాలి. 2022 కల్లా దేశంలో, 2029లో ప్రపంచంలో నంబర్‌ వన్‌ చేస్తానంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జీడీపీ రేటింగ్‌ 3 శాతం ఉంది. చైనా 6.5 శాతం, మన దేశం 7.2 శాతం జీడీపీలో నడుస్తుంటే.. మన రాష్ట్రం మాత్రం 12 శాతంతో ముందుకు వెళ్తుందని చంద్రబాబు చెబుతున్నారు.. 12 శాతం జీడీపీతో ఉన్నప్పుడు మళ్లీ 2022 ఎందుకు, 2029, 2050 ఎందుకు? ఇప్పుడే మనం నంబర్‌ వన్‌ కదా చంద్రబాబూ.  
– చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం లేదని చెప్పడానికి ఇదే నిదర్శనం. అబద్ధాలు కవర్‌ చేసుకోవడానికి మరిన్ని అబద్ధాలు చెబుతాడు. ఒకే అబద్ధం చెప్పిందే చెప్పి అదే నిజం అని నమ్మించే వ్యక్తిత్వం చంద్రబాబుది. 
– ఆగస్టు 9వ తేదీ వరకు రాయలసీమ –12 శాతం, అనంతపురం –22 శాతం వర్షపాతం ఉంటే కరువు మండలాల కింద డిక్లేర్‌ చేయరు. క్యాబినెట్‌ మీటింగ్‌ పెడతారు కానీ కరువుపై మాట్లాడరు. నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్యూరెన్సులు ఎగ్గొట్టే ప్రయత్నం. ఇది చంద్రబాబు పరిపాలన. 
– కంది, మినుము, పత్తి, పెసరు, మిర్చి ఇలా రాష్ట్రంలో పండించే పంట ఏదైనా తీసుకోండి.  ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా.. నాలుగు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. 
– ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దళారీగా మారి రైతులను ఇంకో దళారులకు అమ్ముతున్నాడు. రైతుల పంటలను హెరిటేజ్‌ మార్కెట్‌లో అధిక ధరకు అమ్ముకుంటున్నాడు. తన మార్కెట్‌లో అమ్ముకోవడానికి దళారి అవతారం ఎత్తాడు. రైతులకు టమాటా అమ్మితే వచ్చేది కిలోకు రూ.5 మాత్రమే. అదే హెరిటేజ్‌లో ప్యాకింగ్‌ చేసి చంద్రబాబు రూ.50కి అమ్ముతున్నాడు.  
– చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత మేలు జరిగిందా కీడు జరిగిందా అని రైతులు ఆలోచన చేయాలి. పంట సాగుచేసే పరిస్థితుల్లో రైతులు లేరు. పట్టిసీమతో రాయలసీమకు నీరు ఇచ్చాను అని గొప్పలు చెప్పుకుంటున్నాడు. నదులను అనుసంధానం చేశాను. అందుకనే పంటలు సస్యశ్యామలంగా ఉన్నాయని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడు. అయ్యా చంద్రబాబు పట్టిసీమతో రాయలసీమకు న్యాయం జరిగిందంటావే.. పట్టిసీమలో నువ్వు పోసింది చెంబెడు నీరు. అవి రాయలసీమకు వచ్చాయా..? 
అదే పోలవరం కట్టివుంటే చెంబు కాదు ఏకంగా చెరువునే పోయవచ్చు.. పట్టిసీమ కాలువను కట్టింది ఎవరో నీకు గుర్తులేదా.. చంద్రబాబూ.. దివంగత ప్రియతమనేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కదా..?
– నాగార్జున సాగర్‌ కుడికాల్వ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి దాదాపు 140 టీఎంసీల నికరజలాల నీరు రావాల్సివుంది. ఆ నికర జలాలతో 11 లక్షల ఎకరాలు సాగు చేసుకోవచ్చు.. అయినా కుడి కాల్వ నీటిని సాగుకు ఇవ్వడం లేదు. అదే ఎడమ కాల్వ  నుంచి తెలంగాణకు నీరు వెళ్తుంది.. అక్కడ ప్రతి సంవత్సరం వరి పంట వేస్తున్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో ఆంధ్రరాష్ట్రంలో వరిపంట  గణనీయంగా సాగుచేసేవారు.. ఇప్పుడు చంద్రబాబు హయాంలో వరిసాగు ఎందుకు తగ్గింది.. దానికి కారణం సాగునీటి ఎద్దడి.  
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 44 క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో మహానేత వైయస్‌ఆర్‌ ప్రారంభించారు. ఆయన హయాంలోనే 85 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 15 శాతం ఇప్పటికీ చంద్రబాబు పూర్తి చేయలేకపోయాడు. ఇంత దారుణంగా చంద్రబాబు పాలన సాగిస్తుంటే రైతులు ఎలా బతకాలి. 
– మన ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. వ్యవసాయం పండుగ మాదిరిగా జరిపిద్దాం. ఆత్మీయ సదస్సులో రైతుల సలహాలు, సూచనలు తీసుకొని మ్యానిఫెస్టోలో మార్పులు కూడా చేస్తాం. 

తాజా వీడియోలు

Back to Top