చంద్రబాబుకు బుద్ధిచెప్పుతాం..

ముస్లిం పట్ల టీడీపీ వివక్ష చూపుతోంది
వైయస్‌ జగన్‌ను కలిసిన అనంతపురం ముస్లింలు
విశాఖః అనంతపురానికి చెందిన ముస్లింలు పాదయాత్రలో జననేత వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. టీడీపీ ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు సభలో ముస్లింల పట్ల బాబు వ్యవహరించిన తీరు దుర్మార్గమన్నారు. సమస్యలు చెప్పితే అక్రమకేసులు బనాయించటం దారుణమన్నారు. ముస్లిం మైనారిటీలను టీడీపీ ప్రభుత్వం అణిచివేస్తోందని విమర్శించారు. .నారా హటావో ఏపీ బచావో నినాదంతో చంద్రబాబుకు బుద్ధిచెబుతామన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో  ఎంతో లబ్ధిపొందామన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో ముస్లింలు ఎంతో అభివృద్ధి చెందారని, ఆయన మరణంతో ముస్లిం అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. మళ్లీ ముస్లింలకు మేలు జరగాలంటే జననేత వైయస్‌ జగన్‌ రావాలని కోరారు. టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలు నరకం అనుభవిస్తున్నారన్నారు.టీడీపీ 2014 మేనిఫెస్టోలో తొమ్మిది మంది మైనార్టీలు సీట్లు కేటాయించి 2500 కోట్లు బడ్జెట్‌తో మైనారిటీల అభివృద్ధికి కృషిచేస్తామని పేర్కొన్నారని, కాని హామీలన్నీ తుంగలో తొక్కిందని విమర్శించారు.
Back to Top