ఇసుక దోపిడీపై విచారణ జరిపించాలి

విజయవాడః వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు అవినీతిని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. ఉచితం మాటున ఇసుకను లూటీ చేస్తూ... కొన్ని వందల కోట్ల రూపాయలను బాబు టీడీపీ నాయకులకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ ఫండ్ కోసమా లేక వచ్చే ఎన్నికల ఖర్చుల కోసమా బాబు మీ దోపిడీ అంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రతి కేబినెట్ మీటింగ్ లో బాబు ఇసుక దోపిడీపైనే చర్చిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం వల్ల కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందదని మిత్రపక్షం బీజేపీ నేతలే చెబుతున్నారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నీ బాబు జేబుల్లోకి వెళుతున్నాయని కమలనాథులే అంటున్నారని చెప్పారు.

Back to Top