జన్మభూమి కమిటీ పేరుతో చంద్రబాబు అవినీతి: లేళ్ల అప్పిరెడ్డి

గుంటూరు: జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడుతూ అబద్దాలు చెబుతూ ప్రజలను వంచిస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌నేత లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఆర్భాటంగా చేస్తున్న జన్మభూమి కార్యక్రమానికి సంబంధించి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తూలు ఇప్పటికే మున్సిపాలిటీ కార్యాలయంలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో జన్మభూమి కమిటీలో చేరిన ప్రతిపక్ష పార్టీ సభ్యులను ఎందుకు హడావిడిగా తొలగించారని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల ప్రజలపై పక్షపాతంతో వ్యవహరిస్తే వైయస్‌ఆర్‌ సీపీ చూస్తూ ఊరుకోదని ఆ కమిటీలను హెచ్చరించారు. ప్రజలకు మేలు జరిగేంత వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని, అవసరమైతే మున్సిపాలిటీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పారు. జన్మభూమి కమిటీల పేరుతో పేదలకు అన్యాయం జరిగే పక్షంలో ఎమ్మెల్యే ముస్తఫా ఆ కమిటీ నుంచి తప్పుకొని ఉద్యమబాటపట్టనున్నారని ప్రభుత్వానికి సూచించారు. 
Back to Top