చంద్రబాబు ఇస్తున్న శాపాలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చేస్తున్న పాపాలు.. రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారుతున్నాయి. అంతిమంగా తెలుగు ప్రజల భవిష్యత్ అంధకారంగా మారబోతోంది.
అమరావతి శంకుస్థాపన పేరుతో చేస్తున్న పనులు పూర్తిగా విమర్శల పాలవుతోంది. ముఖ్యాంశాలు..
1. శంకుస్థాపన అంటే ఒక లాంఛనపూర్వక తంతు. దీనికి దేశ విదేశాల నుంచి అతిథుల్ని పిలిచి హంగామా చేయటం అంటే అసలు తక్కువ, ఆర్భాటం ఎక్కువ అనిపించక మానదు.
2. ఒక్క రోజు ఘట్టానికి మొత్తంగా రూ. 400 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారు అంటే ప్రజా ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో తెలుస్తుంది.
3. రెండు నెలలుగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇదే పనిలో ఉంది. పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేసి మరీ ఈ తతాంగాన్ని నడిపిస్తున్నారు.
4. పోలీసు యంత్రాంగం లో సగభాగం దాకా ఇప్పుడు అమరావతి ప్రాంతంలోనే నిమగ్నమై ఉంది.
5. వ్యవసాయ కూలీలకు నైపుణ్యాలు కల్పిస్తామన్నారు, అన్ని విధాలా ఆదుకొంటామన్నారు కానీ ఎక్కడ కూలీల ప్రస్తావన లేదు.
6. రైతుల దగ్గర నుంచి పచ్చటి పంట పొలాల్ని తీసుకొని, భూమిపై వాళ్ల హక్కుల్ని లాగేసుకొని విదేశీ సంస్థలకు కట్టబెడుతున్నారు. అంటే పరాయి పాలనకు పరోక్షంగా ఊతం ఇవ్వటమే
7. విదేశీ సంస్థలు అంత ఉచితంగా ప్రేమగా దీన్ని నిర్మిస్తాయని ఎలా చెప్పగలుగుతున్నారు.
8. సింగపూర్ సంస్థలు ఎంత కాలంపాటు, ఎక్కడెక్కడ ఫీజులు వసూలు చేసుకొంటాయనే దానిపై స్పష్టత లేదు.
9. పారదర్శకంగా టెండర్ల విధానానికి పాతర వేసి స్విస్ ఛాలెంజ్ పద్దతిలో ఎందుకు ఎంపిక చేస్తున్నారు.
10. ఖజానా ఖాళీ అయిపోయినా అధిక వడ్డీలకు అప్పు తెచ్చి మరీ ఆర్భాటంగా శంకుస్థాపన ఎందుకు చేస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top