సోషల్ మీడియాపై బాబు అసహనం

హైదరాబాద్ః సోషల్‌ మీడియాపై చంద్రబాబు సర్కారు అసహనం ప్రదర్శించడాన్ని వైయస్సార్ సీపీ నాయకులు ఖండించారు. వైయస్సార్ సీపీ సోషల్‌ మీడియా కార్యాలయంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించడాన్ని తప్పుబట్టారు. సోషల్‌ మీడియా విషయంలో టీడీపీ ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోందని వైయస్సార్ సీపీ నేత కన్నబాబు అన్నారు. లోకేశ్‌ కు మంత్రిగా ఉండే సామర్థ్యం లేదని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ లోపాలు, తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా మారకూడదని మరో నాయకుడు జోగి రమేశ్‌ అన్నారు. సోషల్‌ వ్యవస్థను మూసేయాలని భావించడం మంచి పరిణామం కాదని పేర్కొన్నారు. గూగుల్‌ లో పప్పు అని కొడితే లోకేశ్‌ కు సంబంధించిన సమాచారం వస్తోందని తెలిపారు. మంత్రి పదవి నిర్వహించే ప్రతిభా పాటవాలు లోకేశ్‌ కు లేవని జనం నమ్ముతున్నారన్నారు.  చంద్రబాబుకు కంటిమీద కనుకు కరువయ్యే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.
Back to Top