చంద్రబాబు గిరిజనుల ద్రోహి

బుట్టాయగూడెం:ఏజెన్సీ ప్రాంతంలో లభించే ఖనిజ సంపదపై ఉన్న ప్రేమ చంద్రబాబుకు ఆ ప్రాంతంలో నివసించే గిరిజనులపై లేదని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమ‌ర్శించారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గిరిజనుల పట్ల చంద్రబాబు చాలా నిర్లక్ష్యధోరణి ప్రదర్శిస్తున్నారన్నారు. దీనికి నిదర్శనం బాబు క్యాబినెట్‌లో ఒక గిరిజన మంత్రి కూడా లేకపోవడమే అన్నారు. రాష్ట్రంలో 7 శాతం గిరిజనులు నివసిస్తున్నా చంద్రబాబు గిరిజనులకు అవకాశం ఇవ్వకుండా రాజ్యాంగాన్ని తుంగలో తొక్క‌డ‌మేన‌ని మండిప‌డ్డారు. దివంగత మహానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి గిరిజనుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆ కృతజ్ఞతతోనే 6 నియోజకవర్గాల్లో గిరిజనులు వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి గిరిజనుల అభివృద్ధి పూర్తిగా కుంటిపడిందన్నారు. అదే విధంగా గిరిజన చట్టాలను సక్రమంగా అమలు చేయడంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడంలేదన్నారు. గిరిజనుల హక్కులు, చట్టాలను తుంగలో తొక్కడం వల్ల ఆదివాసీల జీవ‌నం వర్ణనాతీతంగా మారుతుందన్నారు. చంద్రబాబు పూర్తిగా గిరిజన ద్రోహి అని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు గడిచినప్పటికీ గిరిజన సలహా మండలి ఇంతవరకూ ఏర్పాటు చేయలేదన్నారు. చంద్రబాబు గిరిజన ప్ర‌జ‌లంతా 2019 ఎన్నిక‌ల్లో త‌గిన బుద్ధి చెబుతున్నార‌ని హెచ్చ‌రించారు.  
Back to Top