హామీలు నెరవేర్చకుండా ప్రజల సొమ్ముతో జల్సాలా...?

అనంతపురం: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలన్నీ గాలికొదిలేసి, ప్రజల సొమ్ముతో చంద్రబాబు జల్సాలు చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి విమర్శించారు. ప్రజల క్షేమాన్ని కాంక్షించకుండా ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తూ, రూ. కోట్లు ఖర్చు చేసి ఇళ్లు కట్టించుకుంటున్నాడని మండిపడ్డారు. అనంతపురం పట్టణంలో గురునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మూడేళ్లలో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని, ఈ అవినీతి పాలనకు స్వస్తి పలకాలన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అనంతలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. 

Back to Top