బాబు పాలనలో అభివృద్ధి కుంటుపడింది

నెల్లూరు: చంద్రబాబు మూడేళ్ల పరిపాలనలో నెల్లూరు జిల్లాలో అభివృద్ధి అడుగంటిపోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను విస్మరించాడని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. రామాయపట్నం పోర్టు గురించి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు పోర్టును వేరే ప్రాంతానికి తరలించేందుకు కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు కాగితాలకే పరిమితమైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలుకై త్వరలోనే పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Back to Top