మూడేళ్లలో విచ్చలవిడి అవినీతి

గుంటూరు: మూడేళ్ల అధికారంలో చంద్రబాబు ప్రజలకు చేసిన మంచిపని ఒక్కటి కూడా లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. రైతులను, నిరుద్యోగులను, మహిళలను అన్ని వర్గాల వారిని వంచనకు గురిచేశాడని ఆయన ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు కోన రఘుపతి, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. మూడేళ్ల పాలనలో చంద్రబాబు రూ. లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. చంద్రబాబు అరాచక పాలనను ప్రజలకు వివరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నేతలు జంగా కృష్ణమూర్తి, బొల్లా బ్రహ్మనాయుడు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Back to Top