చంద్రబాబు విచ్చలవిడి అవినీతి

గుంటూరుః ఆంధ్రరాష్ట్రంలో చంద్రబాబు విచ్చలవిడిగా  అవినీతికి పాల్పడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. వృద్ధ్యాప్య పెన్షన్ మొదలు ప్రతి అంశంలోనూ టీడీపీ నేతలు లంచాలకు అలవాటు పడ్డారని మండిపడ్డారు. ముఖ్యమంత్రే బహిరంగంగా ఓటుకు కోట్లు ఇస్తూ అవినీతికి పాల్పడుతున్నప్పుడు...మేమెందుకు చేయకూడదన్న ధోరణిలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సహా టీడీపీ నేతలంతా వెళ్లారని ఫైర్ అయ్యారు.

Back to Top