బాబు గుండె పగిలిపోవడం ఖాయం

నంద్యాల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండ్‌ నిండిపోయింది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి జనం అధిక సంఖ్యలో తరలిరావడంతో దారులన్నీ ఎస్పీజీ గ్రౌండేకే అన్నట్లుగా మారింది. సభకు వెళ్లకుండా టీడీపీ నేతలు ప్రలోభపెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా జనం కదం తొక్కుతూ ముందుకు కదిలారు.  వేలాదిగా జనం తరలివచ్చారంటే ఇదే వైయస్‌ జగన్‌పై ఉన్న ప్రేమకు నిదర్శనమని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు.  ఈ జనాన్ని చూసి చంద్రబాబు గుండె పగిలిపోవడం ఖాయమన్నారు. టీడీపీ అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా చేసుకొని పారిపోతారేమోనని ఎద్దేవా చేశారు.

Back to Top