పుట్టిన గడ్డపై ప్రేమాను బంధాలు లేని వ్యక్తి చంద్రబాబు


తాను పుట్టిన ఊరు, చదివిన పాఠశాలలపై కూడా అనుబంధం లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టమని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఎలాంటి అనుబంధాలు ఉండవనీ, ఆయనకు కావాల్సింది రాజకీయాలే అని, అందుకు పిల్లనిచ్చినా మామనైన సరే మరెవరైనా సరే వదిలిపెట్టకుండా వెన్నుపోటు పొడవడమే ఆయన నైజమని తూర్పారపట్టారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత, ఆదివారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గం దామల చెరువులో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి , చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టారు. పాదయాత్రలో భాగంగా వేలాది మంది తన అడుగులో అడుగు వేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో వేలాది మంది కష్టాలు చెప్పుకుంటూ , తన భుజం తడుతూ ,  వెంట ఉంటామని ధైర్యమిస్తూ  నడిపిస్తున్నారని పేర్కొన్నారు. అనేక కష్టనష్టాలతో బాధలు పడుతున్నప్పటికీ  ఆత్మీయతను పంచుతున్న ప్రజలకు  కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రగిరీ ....నీకు దిక్కేది...

సాక్షాత్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన ప్రాంతమైన చంద్రగిరి నియోజకవర్గంలోని పరిస్థితులను ఒకసారి చూడండంటూ అక్కడి దుస్థితిని కళ్లకు కట్టినట్లు వివరించారు. 
1977 చంద్రబాబు ఇక్కడి నుంచే కాంగ్రెస్ తరరున పోటీ చేశారు, 2500  ఓట్లతో గెలిచారు. అప్పట్లో  నాన్నగారు వైయస్ రాజశేఖరరెడ్డి  పుణ్యాన మంత్రి కూడా అయ్యారని జగన్ వివరించారు. 1983 లో మంత్రిగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.17400 పై చిలుకు ఓట్లతో ఓడిపోయారు. ఆయన పనితీరుకు అప్పట్లోనే ప్రజలు గుణపాఠం చెప్పారంటేనే , ఎంత గొప్పగా చంద్రగిరిని అభివృద్ధి పథంలో నడిపించారో తెలుస్తోంది. ఆ తరువాత మంత్రి పదవిని ఇచ్చిన కాంగ్రెస్ ను వదిలేసి మామగారి పార్టీలో చేరారన్నారు.  
మామతో కూడా నిజాయితీగా పనిచేయలేదు. ఓడిపోయి చచ్చిన పాములా ఉన్న వ్యక్తిని మామ ఎన్టీఆర్  ఆదరించారు. ఆశీర్వదించి, ఆదరించిన మామనూ చంద్రబాబు వదిలిపెట్టలేదు, అధికారం కోసం, రాజకీయం కోసం అధికారం కోసం  కూతురినిచ్చిన సొంత మామ ఎన్ టిఆర్ కు  వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి రాష్ట్ర  ప్రజలు ఒక లెక్కనా ? అని ప్రశ్నించారు. అవసరముంటే ఎవరి కాళ్లైనా పట్టుకుంటారు, అవసరం తీరిపోయాక, ఎవరినైనా సరే వెన్నుపోటు పొడుస్తారు ఇది చంద్రబాబు నాయుడి చరిత్ర మనమంతా చూశామని జగన్ వివరించారు. 
 చంద్రగిరి నియోజకవర్గంలోనే  చంద్రబాబు పుట్టిన గడ్డమీదనే, ముఖ్యమంత్రిగా గతంలో 9 ఏళ్లు, ఇప్పుడూ మళ్లీ  4 ఏళ్లుగా ఉన్నా ఇక్కడున్న పరిస్థితులు ఆశ్చర్యకరంగా ఉన్నాయంటూ ఒక్కొక్కటిగా అంశాలను జగన్ ప్రస్తావించారు. 
బాబు చదువుకున్న శేషాపురం  స్కూలు  శిథిలా వస్థలో ఉంది, అని చాలా మంది చెప్పారు.  పుట్టిన ఊరిమీద, చదివిన స్కూల్ మీద కొద్దో గొప్పో ప్రేమ లేని వ్యక్తి,ముఖ్యమంత్రిగా ఉన్నారంటే రాష్ట్రంలోని స్కూళ్లపై ప్రే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో నాన్నగారి హయాంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఉచ్చారు ఆయన చనిపోయిన తరువాత మర్చిపోయారు. చంద్రబాబు గారి వచ్చిన తరువాతైనా ఎక్కడైానా కనిపించిందానా?  ఉత్తర్వులు ఇచ్చినా కనిపించని దుర్భర పరిస్థితి ఉంది. 
ఈ నియోజకవర్గంలో 138 పంచాయితీలు ఉన్నాయి, దాదాపు 70 శాతం పలెల్ల్లో తాగడానికి నీళ్లు లేవు. సాగుకు , తాగుకు నీళ్లుని పరిస్థితి ఉందంటే  సొంత ఊరుపై చంద్రబాబుకున్న ప్రేమ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు కానీ సొంత ఊరిలో మాత్రం వసతులు కల్పించరంటూ బాబు వైనాన్ని ఎండగట్టారు. 
 ఈ మనిషి రాజకీయాల్లో కోసం చూస్తారే తప్ప సొంతమనేది లేదు, ఎవరినైనా సరే అవసరానికి వాడేసుకుంటారు , సొంతమామైనా సరే, ఇకొకరానై సరే అని విమర్శించారు. పుట్టిన గడ్డైనా సరే, సొంత తమ్ముడైనా సరే రాజకీయాలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తారు. 
ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే పేదలకు ఇళ్లు కట్టరు, ఫించన్లు ఇవ్వరు, రేషన్ కార్డు ఇవ్వరు, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు తీసుకునే వ్యవస్థను తయారు చేశారు తప్ప, ఒక్కరికీ కూడా ప్రయోజనం కల్పించలేదన్నారు. 

ఏనుగులు వచ్చి బీభత్సం సృష్టిస్తున్నా...

ప్రతి  సంవత్సరం చంద్రగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో  ఏనుగులు వచ్చిన పంట నష్టం చేస్తూనే ఉన్నాయని అని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా వీటి నివారణకు చర్యలు తీసుకోలేదు. మామిడి వంటి తోటలు నాశనం అయినా కూడా ఏ ఒక్కరోజు కూడా పంట నష్టం ఇవ్వలేదు. 

ఇదే దామలచెరువులో మార్కెట్ ఉంది. ఏటా వంద కోట్లకు పైగా లాావాదేవీలు జరుగుతున్నా, సెన్సు రూపంలో సంవత్సరానికి కోటి రూాపాయలు  రైతుల ముక్కు పిండి వసూలు చేస్తున్నా మార్కెట్ కు వచ్చే దారి ఎలా ఉందో ఒక్కసారి చూడాలంటూ జగన్ అన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడల్లా అక్కడి రోడ్లలాగా రాష్ట్ర రహదారులను చేస్తానంటూ గొప్పలు చెప్పుకునే బాబు తన సొంత ఊరులోని రోడ్ల గురించి ఏనాడు పట్టించుకోలేదన్నారు. 
సింగపూర్ కు వెళితే సింగపూర్ లాచేస్తానంటాడు, జపాన్ వెళితే జపాన్ చేస్తానటాడు, ఇంకా నయం చిత్తూరుకు సముద్రాన్ని తెస్తానని చెప్పలేదు, సంతోషించాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అందరినీ మోసం చేశారు...

 దారుణమైన వ్యక్తి మన రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. రాజకీయాల కోసం ఏమి చెప్పారో అందరికీ తెలుసు, నాలుగేళ్లుగా ఎవరినీ వదలిపెట్టలేదు. రైతులకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు. పూర్తిగా భేషరతుగా మాఫీ చేస్తానంటూ  బ్యాంకుల్లో బంగారాన్ని ఇంటికి తెస్తానంటూ ఎంతదారుణంగా మోసం చేశారో అందరికీ తెలిసిందనంటూ వైయస్ జగన్ అన్నారు. 
పొదుపు సంఘాలఅక్కచెల్లెమ్మలను ఎంత దారుణంగా మోసం చేశారో చెప్పనక్కర్లేదు, మోసం చేయడమే  కాకుండా, అన్యాయం కూడా చేశారు. అంతవరకు చంద్రబాబు రాకమునుపు  వడ్డీలేని( సున్నా వడ్డీకే ) రుణాలు వచ్చేవి, బాబు వచ్చాకు వడ్డీ లెక్కలు బ్యాంకులకు కట్టడం మానేశారు. దీంతో బ్యాంకులు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం మానేశాయి. బ్యాంకులు ముక్కు పిండీ వడ్డీలు వసూలు చేస్తున్నాయి.  18-24 శాతం వరకు వసూలు చేస్తున్నారు. 

చదువుకునే విద్యార్ధులను కూడా వదిలిపెట్టలేదు, దయాదాక్షిణ్యం  ఏమీ లేదు, పిల్లలకు ఏంచెప్పాడూ!  జాబు రావాలంటే... బాబు రావాలంటా వారిని వదిలిపెట్టలేదు, ప్రతి ఇంటికి కాగితం పంపించారు. అటూ ఉద్యోగం ఇవ్వలేదు, ఇటు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ప్రతి ఇంటికి దాదాపు 90 వేల బాకీ పడ్డారంటూ జగన్ విమర్శించారు. ఇంతటి స్థాయిలో రాజకీయ వ్యవస్థను నాశనం చేసిన  ఈ పెద్దమనిషి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటూ బాబు తీరును ప్రజలకు వివరించారు. 

ప్రతి దానిలోనూ అవినీతే

ఈ నాలుగేళ్ల పాలనలో అవినీతిని ఎలా జరుగుతుంతో చెప్పాల్సిన పనిలేదంటూ. మట్టి,ఇసుకుని చూసినా అవినీతి మయమే అని , బొగ్గులు, కరెంటు కొనుగోళ్లు, కాంట్రాక్టర్లు ,రాజధాని భూములు, గుడి భూములు ప్రతిదానిలోనే అవినీతే వేటినీ వదిలిపెట్టలేదంటూ మండిపడ్డారు. విచ్చలవిడిగా అవినీతి సాగిస్తున్నారు. బాబు లెవల్లో ఆయన  స్థాయిలో, కిందమో జన్మభూమి కమిటీలో పేరుతో గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వారిని దోచుకోమని  గ్రామల మీద వదిలేశారు. ఫించను కావాలాన్నా, చివరకు మరుగుదొడ్లు కావాలన్న లంచాలు తీసుకుని దుస్థితి నెలకొందన్నారు.

హామీల గురించి ప్రశ్నిస్తే తాట తీస్తారట
 
ఈ పెద్దమనిషి చంద్రబాబును ఎవరైనా ఇచ్చిన హామీల గురించి అడిగితే, ఆయన నోట్లో నుంచి వచ్చే మాటలు తాటతీస్తా...జాగ్రత్త అంటూ హెచ్చరిస్తారని జగన్ అన్నారు. ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటనల గురించి  ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తిని ప్రజలు అడిగితే , తమాషా పడతా ఉన్నారా, తాటతీస్తా అని బెదిరిస్తున్నారంటూ వైయస్ జగన్ ఆక్షేపించారు. ఇంతటి స్థాయిలో ప్రజలపై దుర్బాష్యాలాడుతున్న వారి  కళ్లు ఎక్కడున్నాయో అర్ధం అవుతోందన్నారు.
నాలుగేళ్లు అయిపోయింది, సంవత్సరంలో ఎన్నికలు జరగబోతాయో ఈ పెద్దమనిషే చెపుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలాంటి వారు కావాలో నిర్ణయించుకోవాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం కావాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు, చేస్తామని చెప్పిన పనులు  చేయకపోతే, ఇంటికి పోయే  పరిస్థితి రావాలని, రాజకీయాల్లో విశ్వసనీయత పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రచ్చబండ ద్వారా ప్రజల ఇబ్బందులను, కష్టాలను  జగన్ అడిగి తెలుసుకున్నారు.

Back to Top