ప్ర‌జ‌ల‌కు ప‌నికొచ్చే ప‌నుల్ని ప‌ట్టించుకోరా..!

విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న 12 సంస్థ‌ల ఏర్పాటుకి కేంద్రం ఓకే
భూములు కేటాయించ‌కుండా ఏడిపిస్తున్న చంద్ర‌బాబు స‌ర్కారు
ప్రైవేటు మీద మాత్రం త‌ర‌గని మోజు

హైద‌రాబాద్‌: ప్ర‌జ‌ల‌కు ప‌నికి వ‌చ్చే అంశాల మీద ఏమాత్రం ప్ర‌భుత్వం శ్ర‌ద్ధ చూప‌టం లేదు. కమీష‌న్లు వ‌చ్చే ప‌ట్టిసీమ మీద‌, సింగ‌పూర్ కు దోచిపెట్టే రాజ‌ధాని భూముల సేక‌ర‌ణ మీద పెడుతున్న శ్ర‌ద్ధ‌లో ప‌దో వంతు కూడా ప్ర‌జ‌ల‌కు ప‌నికి వ‌చ్చే అంశాల మీద పెట్ట‌డం లేదు. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న 12 సంస్థ‌ల ఏర్పాటుకి కేంద్రం ముందుకు వ‌చ్చిన‌ప్ప‌టికీ, రాష్ట్ర స‌ర్కారు మాత్రం నిర్ల‌క్ష్య పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో జాతీయ విద్యాసంస్థ‌లు తెలుగు విద్యార్థుల‌కు అందుబాటులోకి రాకుండా పోతున్నాయి.

కేంద్రం సుముఖ‌త‌
విభ‌జ‌న చ‌ట్టంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కొన్ని జాతీయ విద్యాసంస్థ‌ల ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌క‌టించింది. విశాఖ లో ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆప్ మేనేజ్ మెంట్ , విజ‌య‌న‌గ‌రంలో గిరిజ‌న విశ్వ విద్యాల‌యం, కాకినాడ‌లో పెట్రోలియం యూనివ‌ర్శిటీ, తాడేప‌ల్లిగూడెంలో నిట్‌, తిరుప‌తిలో ఐఐటీ, ఐఐఎస్ ఆర్‌, అనంత‌పురంలో సెంట్ర‌ల్ యూనివర్శిటీ, నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సైజ్ అకాడ‌మీ, క‌ర్నూలులో ఐఐఐటీ, రాజ‌ధాని ప్రాంతంలో ఎయిమ్స్, వ్య‌వ‌సాయ విశ్వ విద్యాల‌యం, డిజాస్ట‌ర్ మేనేజిమెంట్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకి కేంద్రం ముందుకు వ‌చ్చింది. వీటికి భూములు కేటాయించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరింది.

బాబు స‌ర్కారు నిర్వాకం
గ‌త 15 నెల‌ల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం మూడు సంస్థ‌ల‌కు మాత్ర‌మే భూములు కేటాయించింది. విశాఖ లో ఐఐఎమ్ కు 300 ఎక‌రాలు, తిరుప‌తికి స‌మీపంలో ఐఐటీకి 400 ఎక‌రాలు, ఐఐఎస్ ఆర్ కు 434 ఎక‌రాలు కేటాయించింది. ఎయిమ్స్ కు, క‌స్ట‌మ్స్ అకాడ‌మీల‌కు భూములు కేటాయించిన‌ప్ప‌టికీ అవి వివాదాస్పదం అయ్యాయి. విజ‌య‌వాడ కు సమీపంలో ఎన్ ఐ డీ ఎమ్ కేటాయించాల‌ని భావించినా, ప్ర‌భుత్వం భూములు కేటాయించ‌క పోవ‌టంతో దాన్ని డిల్లీ కి త‌రలించాలని సూత్ర  ప్రాయంగా నిర్ణ‌యించారు.

ప్రైవేటు మీద మాత్రం మోజు
ఒక వైపు ప్ర‌తిష్టాత్మ‌క జాతీయ విద్యాసంస్థ‌ల ఏర్పాటుకి మోకాల‌డ్డుతున్న‌స‌ర్కారు ప్రైవేటు సంస్థ‌ల‌కు మాత్రం భూముల్ని బాగానే స‌మ‌కూర్చుతోంది. రాజ‌ధాని ఏర్పాటు పేరుతో వేల ఎక‌రాల్ని సింగ‌పూర్ సంస్థ‌ల‌కు ఇచ్చేందుకు రంగం సిద్దం అయింది. ప్రైవేటు సంస్థ‌లు అడిగినంత‌నే ఎక‌రాల కొద్దీ భూముల్ని అప్ప‌గిస్తున్న ప్ర‌భుత్వం... జాతీయ సంస్థ ల ఏర్పాటుని ప‌ట్టించుకోక పోవ‌టం గ‌మ‌నార్హం.
Back to Top