తెల్లతోలు, పిల్లికళ్లుంటే చాలు ఏదైనా రాసిస్తారు

హైదరాబాద్ః అన్న‌పూర్ణ రాష్ట్రంగా ఉన్న ఏపీని చంద్రబాబు అవినీతి రాష్ట్రంగా మార్చ‌ార‌ని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టేందుకే బాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశాలు తిరగడం, అక్కడి వాళ్లతో ఫోటోలు దిగడం, నా గురించి, అమరావతి గురించే అంతా చెప్పుకుంటున్నారని బాబు చెప్పడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ఈరెండేళ్లలో బాబు రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే.....

 • రాష్ట్రాన్ని బాబు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ు. 
 • టీడీపీ పాలనలో అవినీతి పెట్రేగి పోతోంది. 
 • బాబు విదేశీ ప‌ర్య‌ట‌నల‌పై కేంద్ర ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రిపించాలి. 
 • అస‌లు బాబు ఏ దేశానికి వెళ్తున్నారు..?ఎందుకు వెళ్తున్నారు..? ఎంతమేర పెట్టుబ‌డులు తెస్తున్నారో కేంద్ర‌ప్ర‌భుత్వం పరిశీలించాలి.
 • కొత్త రాష్ట్రంలో ఒక్క రైల్వేజోన్ కూడా మంజూరు కాలేదు. 
 • కానీ, చంద్ర‌బాబు మాత్రం బుల్లెట్ ట్రైన్ ద‌గ్గ‌ర ఫొటో దిగి ఏపీకి బుల్లెట్ ట్రైన్ వ‌స్తుందని  చెప్పడం హాస్య‌ాస్ప‌దం.
 • ప్రజలను మభ్యపెట్టేందుకు విదేశాలు పట్టుకు తిరగడం బదులు రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో కేంద్ర ఇచ్చిన హామీల‌పై బాబు పోరాడితే స‌రిపోతుంద‌ి.
 • రాజ‌ధానిని సింగ‌పూర్‌కు అప్ప‌గించారు.
 • 972 కిలోమీట‌ర్ల మేర ఎక్క‌డ కావాల‌న్న ఓడ‌రేవు పెట్టుకోండి అని చైనా వారికి భూములు అప్పజెప్పుతున్నాడు.
 • మొత్తం భార‌త‌దేశానికి అన్ని దేశాల నుంచి గ‌తంలో వ‌చ్చిన పెట్టుబ‌డులు రూ. ల‌క్ష 50 వేల కోట్లు.
 • కానీ ఒక్క దొనుకొండ‌లోనే చైనా రూ. 50వేల కోట్లు పెట్టుబ‌డి పెడుతుంద‌ని బాబు చెబుతున్నారు. అది ఏరకంగా సాధ్యమో చెప్పడం లేదు.
 • బాబుది అంతా ప్రచార ఆర్భాటమే తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదు.
 • ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాష్ట్రానికి ఏ ఉప‌యోగం లేద‌ని బాబు చెప్ప‌డం సిగ్గు చేటు.
 • రాష్ట్ర సంక్షేమం కోసం వైయ‌స్సార్‌సీపీ ఎప్పుడూ ముందుంటుంద‌ి.
 • ఇప్ప‌టికైనా బాబు ప్ర‌తిప‌క్ష పార్టీ స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకొని రాష్ట్రాభివృధ్దికి పాటు ప‌డాలి.
 • అంతేగానీ ప్ర‌తిప‌క్ష పార్టీగా వ్య‌తిరేక ముద్ర వేయ‌డం స‌రికాద‌ు.
 • ర‌ష్యాతో విడిపోయిన దేశాలు పెట్టుబ‌డుల కోసం ఎదురుచూస్తుంటే... బాబు అక్కడి దేశాల‌కు వెళ్లి ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని చెప్ప‌డం విడ్డూరం. 
 • రైతుల నుంచి భూములు లాక్కొని బాబు త‌న సొంత ప్ర‌యోజ‌నాల‌కు వాడుకుంటున్నార‌ు. 
 • హ‌రితాంధ్ర‌ప్ర‌దేశ్‌గా ఉన్న రాష్ట్రంలో  అస‌లు వ్య‌వ‌సాయమే లేకుండా చేస్తున్నారు.
 • రూ. 10 నుంచి 15 ల‌క్ష‌ల భూమిని తీసుకుంటామంటూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
 • అసలు ఎవ‌ర్ని అడిగి మీరు భూములు కేటాయిస్తున్నార‌ు బాబు.
 • ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఒక‌మాట‌... అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత  మరో మాట ఎందుకు మాట్లాడుతున్నారో బాబు  ప్రజలకు సమాధానం చెప్పాలి. 
 • ఒక పోర్టు కోసం ల‌క్ష ఎక‌రాలా.
 • నిజంగా పరిశ్రమలు వస్తే రాయలసీమ భూములను ఎందుకు వినియోగించుకోవడం లేదు.
 • దేశానికి అన్నం పెట్టే రైతుల భూముల‌ను లాక్కోవ‌డం దారుణ‌ం.
 • వైయ‌స్సార్సీపీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. 
 • విశాఖ‌ప‌ట్నంలో ఎంఓయూలు కుదుర్చుకున్న రూ. 4.67 ల‌క్ష‌ల కోట్ల‌లో ఒక్క శాత‌మైన మంజూరైందా..? 
 • పిల్లిక‌ళ్లు... తెల్ల‌జుట్టు, తెల్లతోలు ఉంటే చాలు  ఏమైనా రాసిస్తామన్నధోర‌ణి చంద్ర‌బాబులో క‌న‌బ‌డుతోంది. 
 • పేరుగాంచిన పారిశ్రామిక వేత్త‌ల‌కు పార్టీ ముద్ర వేయ‌డం, అక్ర‌మ కేసులు బనాయించడమే బాబుకు తెలుసు. 
 • ప్ర‌పంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మన పారిశ్రామికవేత్తలకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు.  
 • పారిశ్రామికవేత్తలు ఎందుకు ముందుకు రావడం లేదో ఒక్కసారి బాబు ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలి. 

Back to Top