బాబు గజినీ.. హామీలు గుర్తుండవు

–బాబు రాయలసీమ ద్రోహి
– వంద శాతం కుట్రలకు పేటెంట్‌ రైట్స్‌ బాబుదే
–రాయలసీమకు రావాల్సిన ఎయిమ్స్‌ను తరలించారు
 – మహానేతకు పేరొస్తుందని మన్నవరం ప్రాజెక్టును అడ్డుకున్నారు
– రేపటి నుంచి నంద్యాలలో బాబు కుట్రలు, హత్యా రాజకీయాలు 
–  బాబు బెదిరింపులకు బెదిరిపోం
 – వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ధైర్యంగా ఉన్నారు
– నంద్యాలలో టీడీపీ ఓటమి తథ్యమని పవన్‌కు తెలిసింది

నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. రాయలసీమ వాసులను రౌడీలు అంటూ సంభోదించిన సీఎం..ఇంతవరకు వారికి క్షమాపణ చెప్పలేదన్నారు. రాయలసీమ ప్రజల ప్రయోజనాలను ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. కుట్రలు చేయడం చంద్రబాబుకు వందశాతం పేటెంట్‌ రైట్స్‌ ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. నంద్యాలలో ఓటమి తథ్యమని పవన్‌ గ్రహించారని, ఎలాగైనా ఇక్కడ గెలవాలనే చంద్రబాబు రేపు నంద్యాలకు వస్తున్నారని తెలిపారు. శుక్రవారం రోజా నంద్యాలలో మీడియాతో మాట్లాడారు.

– తెలుగు దేశం పార్టీ పెట్టిన ఎన్‌టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, ఆయన మీద చెప్పులు వేసి ఆయన పార్టీని లాక్కున్న కుట్రదారుడు చంద్రబాబే అని రోజా తెలిపారు. 
– తన కేసును తప్పించుకోవడం కోసం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో చేతులు కలిపి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎంపీ ఎ్రరనాయుడితో తప్పుడు కేసులు పెట్టించారని మండిపడ్డారు. 
– చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకొని తప్పు చేయని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని జైలులో పెట్టించేందుకు చంద్రబాబు కుట్ర చేశారని విమర్శించారు. 
–  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించిన కొత్తలో వైయస్‌ జగన్‌ కడప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్, టీడీపీలు ఏవిధంగా కుట్రలు, రౌడీయిజం చేశారో చూశామన్నారు.  బైండోవర్‌ కేసులు పెట్టి భయాందోనకు గురి చేసినా కూడా ప్రజలు వైయస్‌ జగన్, వైయస్‌ విజయమ్మలకు విజయాన్ని అందించారని గుర్తు చేశారు. 
– నంద్యాలలో కూడా చంద్రబాబు తన మంత్రివర్గంతో ఒత్తిడి చేయిస్తూ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తూ, ఆ కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
–  టీడీపీ ఎన్ని అరాచకాలు చేసినా ఎవరూ కడా భయపడే పరిస్థితి లేదని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక విధానానికి నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని చంద్రబాబుకు తెలిసిపోయిందన్నారు. గతంలో నంద్యాలలో తాను ప్రచారానికి రానవసరం లేదు..వన్‌సైడ్‌గా గెలిచిపోతామని చెప్పిన పెద్ద మనిషి ఓటమి ఖాయమని తేలడంతో హడావుడిగా బట్టలు సర్దుకొని రేపు నంద్యాలకు వస్తున్నారని ఎద్దేవా చేశారు.
– రేపటి నుంచి నంద్యాలలో ఎన్నికుట్రలు, ఎన్ని హత్యా రాజకీయాలు, పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని ఏవిధంగా తప్పుడు కేసులు పెట్టిస్తారో మీ అందరూ చూడబోతున్నారని రోజా తెలిపారు. 
– నంద్యాలలో టీడీపీ ఓటమి తథ్యమని పవన్‌ కళ్యాణ్‌ లాంటి మేధావికే  ముందే తెలిసిపోయిందన్నారు. అందుకే పవన్‌ కళ్యాణ్‌ ఈ ఎన్నికలో తటస్థంగా ఉంటున్నామని ప్రకటించినట్లు గుర్తు చేశారు. 
– రాయలసీమ ద్రోహి చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు నంద్యాల ప్రజలకు వచ్చిన అదృష్టమే ఉప ఎన్నిక అన్నారు. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఎదురు చూస్తున్న తీర్పును నంద్యాల ప్రజలు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
–  రాయలసీమకు రావాల్సిన ఏయిమ్స్‌ను ఇక్కడి నుంచి తరలించి ద్రోహిగా మిగిలారన్నారు. రాయలసీమకు రావాల్సిన మెడికల్‌ సీట్లను కూడా ఇక్కడి నుంచి తరలించేందుకు జీవో 120 ఇచ్చారన్నారు. 
–  ముస్లిం మైనారిటీ మెడికల్‌ విద్యార్థులకు యాజమాన్యం అన్యాయం చేయడం వల్ల 8 నెలలుగా చదువు లేక విద్యార్థులు రోడ్ల వెంట తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు మైనారిటీ ద్రోహి అని, ఆయన పట్టించుకోకపోవడంతో కనీసం ఢిల్లీకైనా వెళ్లి మేం ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన చెందుతున్నారని తెలిపారు. 
– వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు అభివృద్ధి కోసం రూ.200 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉండగా, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఈ నిధులపై ప్రశ్నించడం లేదన్నారు. కేంద్రం ఇచ్చిన రూ.50 కోట్లు కూడా దారి మళ్లించి కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈ ఏడాది రాష్ట్రానికి రావాల్సిన రూ.300 కోట్లు కేంద్రం ఇవ్వలేదన్నారు. 
–  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి రాయలసీమలోని చిత్తూరు జిల్లాను విశాఖకు సమానంగా మార్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొని వచ్చి మన్నవరం ప్రాజెక్టు తీసుకొచ్చారని రోజా గుర్తు చేశారు. 
– రాయలసీమలోని 15 వేల మంది యువతకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పించారన్నారు. పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టును ప్రారంభించి పనులు చేపట్టారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు అవుతుందని, తన సొంత జిల్లా చిత్తూరుకు మన్నవరం ప్రాజెక్టు వస్తే ఎక్కడ మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని గుర్తు పెట్టుకుంటారో అని ఆ పనులు ఆగిపోయే విధంగా చేసి నిరుద్యోగులకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. 
–కరువును కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకొని రెయిన్‌గన్ల పేరుతో రూ.200 కోట్లు దోచుకున్నారని రోజా విమర్శించారు. ఎక్కడైనా ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని ఆమె ప్రశ్నించారు. 
–ఎన్నికలకు ముందు 600 హామీలు ఇచ్చారని రోజా గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక 2014 ఆగస్టు 15న మొట్ట మొదటగా కర్నూలులో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో 
కొత్త కొత్త వాగ్ధానాలు చేశారని తెలిపారు. వాటిలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.
– చంద్రబాబు గజని అని, ఈ రోజు చెప్పింది రేపటికి గుర్తు ఉండదని రోజా ఎద్దేవా చేశారు. 
–విభజన చట్టం ప్రకారం రాయలసీమకు సెంట్రల్‌ యూనివర్సిటీ ఇవ్వకపోయినా కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
– 300 ఎలుకలను పట్టడానికి రూ.60 లక్షలు ఖర్చు చేశారని, ఒక్కో ఎలుక పట్టడానికి రూ.20 వేలు తీసుకున్నారని రోజా నిప్పులు చెరిగారు.
–ఇన్ని దోపిడీలు, ఇన్ని దారుణమైన పనులు చేశారు కాబట్టే ఈ రోజు నంద్యాల ఎన్నికల్లో గెలువలేమన్న భయంతో రెండు నెలలుగా కే బినెట్‌ మొత్తాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొబెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్ని గాలికి వదిలేశారన్నారు.
– వైయస్‌ జగన్‌ ఏదో కుట్ర చేస్తారని, ఎన్నికలు ఆపే ప్రయత్నం చే స్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించడం బాధాకరమన్నారు.
–వంద శాతం కుట్రలకు పేటెంట్‌ రైట్స్‌ చంద్రబాబుకే అని రోజా స్పష్టం చేశారు. తుని ఘటనలో రాయలసీమ రౌడీలు ట్రైన్‌ తగులపెట్టారని చంద్రబాబు ఆరోపించారని తెలిపారు. ఈయన పుట్టింది రాయలసీమలోనే అయినా కూడా ఈ ప్రాంతాన్ని అవహేళనగా మాట్లాడారని తప్పుపట్టారు. పోలీసుల విచారణలో ఎక్కడా కూడా రాయలసీమ వాసుల పాత్ర లేదని తెలుసుకోని కనీసం క్షమాపణ కూడా చెప్పలేదన్నారు. ఈ విషయాలు సీమ ప్రజలు మరిచిపోయే ప్రసక్తే లేదన్నారు.
– నంద్యాలలో గెలవలేమని ఎన్నికలు అపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. అందుకే కుట్రలు చేసేందుకు చంద్రబాబు రేపు నంద్యాలకు వస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా మెలగాలని రోజా సూచించారు. టీడీపీ నేతలు ఏం చేయడానికైనా తెగించారన్నారు. అధికారులపై దాడులు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు బదిలీలు చేయిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి వాళ్లను  జైళ్లలో పెడుతున్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్న రకంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని రోజా పేర్కొన్నారు. 
–టీడీపీ ఓడిపోతుందని తెలిసే పవన్‌ ఉప ఎన్నికలో తటస్థంగా ఉన్నానని ప్రకటించారన్నారు. టీడీపీకి దమ్ముంటే కేంద్రం నివేదికలు వెల్లడించాలని సవాల్‌ విసిరారు.
–  హైదరాబాద్‌ గ్రేటర్‌ ఎన్నికల్లో లోకేష్‌ ప్రచారం చేయబట్టే అక్కడ సింగిల్‌ సీటుకు ఆ పార్టీ పరిమితమైందని, అవే ఫలితాలు ఇక్కడ పునరావృతమవుతాయనే లోకేష్‌ను నంద్యాలకు రానివ్వకుండా చంద్రబాబు కట్టడి చేశారని రోజా ఎద్దేవా చేశారు.
–నంద్యాల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని రోజా పిలుపునిచ్చారు. ఎంత డబ్బు ఇచ్చిన, ఎంత బయపెట్టినా లొంగకుండా వైయస్‌ఆర్‌సీపీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి రోజా ధన్యవాదాలు తెలిపారు.
–2004 నుంచి నంద్యాల వైయస్‌ఆర్‌ కుటుంబానికి సొంతమన్నారు. వైయస్‌ఆర్‌ కుటుంబానికి, నంద్యాలకు అంత అవినాభావ సంబంధం ఉందన్నారు. 
– చంద్రబాబేమో నేను వేసిన రోడ్లపై నడస్తూ..నాకు ఓటు వేయారా అని ఓటర్లను బెదిరిస్తున్నారు. ఓటుకు రూ.5 వేలు ఇస్తానని ఆయన గర్వంగా మాట్లాడుతున్నారు. ఆయన బావమరిది బాలయ్య కెమెరాల ముందే రోడ్లపై ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. ప్రేమగా, అభిమానంగా వచ్చిన అభిమానుల చెంప చెల్లుమనిపిస్తున్నారు. 
–మంత్రి ఆదినారాయణరెడ్డి ఎస్సీలకు కించపరుస్తు మాట్లాడుతున్నారు. నంద్యాల ఓటర్లు ఇవన్నీ గమనిస్తున్నారు. 
– నంద్యాల ఓటర్లు డబ్బుకు అమ్ముడబోయే వారు కాదని, పౌరుషం ఉన్నవారని రోజా పేర్కొన్నారు.  తమకు అన్యాయం చేసిన వారికి దెబ్బకు దెబ్బ తీసేలా తమ ఓటు రూపంలో చూపించి నిరూపించాలని ఓటర్లకు రోజా విజ్ఞప్తి చేశారు. 

Back to Top