మోసకారి బాబు పాలన పోవాలి


  • పేదవాడికి ఒక్క ఇల్లు అయినా కట్టించావా బాబూ


  • నిరుపేదల చదువులను అడ్డుకుంటున్న ముఖ్యమంత్రి


  • రైతు ఆత్మహత్యలకు చంద్రబాబే కారణం


  • ఇలాంటి బాబు పాలన పోవాలా.. వద్దా..


  • బాబు అధికార అహం ఎక్కువై కళ్లు నెత్తికెక్కాయి


  • నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజలంతా న్యాయంవైపు నిలబడాలి


  • చింతఅరుగులో వైయస్‌ జగన్‌  ప్రచారం

నంద్యాల: మూడున్నర సంవత్సరాల కాలంగా ప్రజలను మోసం చేస్తూ అవినీతి పాలన చేస్తున్న చంద్రబాబు సర్కార్‌ పోవాలా వద్దా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ నంద్యాల ప్రజలను అడిగారు. నంద్యాల ఉప ఎన్నికల్లో  భాగంగా వైయస్‌ జగన్‌ రోడ్‌ షో నిర్వహించారు.  రోడ్‌ షోలో భాగంగా వైయస్‌ జగన్‌ చింతఅరుగులో మాట్లాడుతూ... నంద్యాలలో జరుగుతున్న ఉప ఎన్నికలు ఒక వ్యక్తిని ఎమ్మెల్యేని చేసుకోవడం కోసం కాదని, న్యాయానికి, ధర్మానికి మధ్య పోరాటం జరుగుతుందన్నారు.  మూడున్నర సంవత్సరాల చంద్రబాబు పరిపాలనను బేరీజు వేసుకొని న్యాయంవైపు నిలబడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు మోసానికి వ్యతిరేకంగా, చెడిపోయిన ఆంధ్ర రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకొచ్చేందుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. 

పేదవాడికి ఒక్క ఎకరా అయినా ఇచ్చారా..?
ఉప ఎన్నికలు వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, మంత్రులు ఒక్క రోజైనా నంద్యాల నడిరోడ్ల మీద కనిపించారా అని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు  కట్టిస్తానని చెప్పాడని, కనీసం ఒక్క ఇల్లు అయినా కట్టించాడా అని ప్రశ్నించారు. ప్రతి పేదవాడికి భూములు ఇస్తానన్నాడు. ఏ ఒక్కరికైనా ఒక ఎకరా భూమి అయినా ఇచ్చాడా..? దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఒక్క నంద్యాలకే 21,800ల పెన్షన్లు ఇచ్చారని, మహానేత మరణాంతరం పెన్షన్లు వరుసగా 15 వేలకు తగ్గాయన్నారు. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో నంద్యాల ఎన్నికలు రాకముందు చంద్రబాబు ఒక్కరికైనా పెన్షన్‌ కార్డులు, రేషన్‌ కార్డు మంజూరు చేశారా అని ప్రజలను అడిగారు . ఇలాంటి మోసాలను చేస్తున్న చంద్రబాబు సర్కార్‌ పోవాలా.. వద్దా.. అని ప్రజలను అడిగారు.

మూడున్నరేళ్ల కాలంలో ఎన్నో మోసాలు..
ప్రతి పేదవాడు ఉన్నత చదువులు  చదువుకోవాలని దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టారని వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. కానీ ఇవాళ ఇంజినీరింగ్‌ చదువుకోవాలంటే పేద కుటుంబాల ప్రజలు భయపడుతున్నారన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం కింద చంద్రబాబు ఇచ్చే రూ. 35వేలు చాలాక విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. అయినా చంద్రబాబు దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇలాంటి చంద్రబాబు పాలన పోవాలా.. వద్దా అని ప్రజలను అడిగారు. నంద్యాలలో వర్షాకాలం వస్తే కాలనీలు మునిగిపోయతాయని తెలిసినా వాటిని బాగు చేసుకోవడానికి చంద్రబాబు ఒక్క రూపాయి కూడా కేటాయించలేకపోయాడని విరుచుకుడపడ్డారు. బెల్ట్‌షాపులు లేకుండా చేస్తానని ఊదరగొట్టిన చంద్రబాబు మూడున్నరేళ్ల కాలంలో బెల్ట్‌షాపులు తగ్గాయా అని ప్రజలను అడిగారు.

ప్రతీ ఇంటికి చంద్రబాబు రూ.76వేలు బాకీ
ఎన్నికల సమయంలో రూ.87,612 కోట్ల రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇవాళ రైతాంగాన్ని నట్టేట ముంచారని వైయస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి రైతు ఏటా రూ.15వేలు అప్పుకు వడ్డీ కడుతున్నారన్నారు. కనీసం వడ్డీలు కూడా రాని పరిస్థితిల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. పొదుపు సంఘాలను నేనే కనిపెట్టానని డబ్బాలు కొట్టుకున్న చంద్రబాబు డ్వాక్రా సంఘాలకు కనీసం ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్నారు. జాబు రావాలంటే బాబు రావాలని, ఒకవేళ జాబు ఇవ్వకపోతే ఇంటికో రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నేటికి ప్రతి ఇంటికి రూ. 76 వేలు బాకీ పడ్డారన్నారు. మూడున్నర సంవత్సరాలుగా మోసం చేస్తున్న చంద్రబాబు మళ్లీ నంద్యాలలో ఉప ఎన్నికలు రాగానే అది చేస్తా.. ఇది చేస్తానని టేపు రికార్డర్‌ ఆన్‌ చేశారన్నారు. ఇలాంటి వ్యక్తి మాటలు ఎవరైనా నమ్ముతారా..?బాబుకు అధికార అహంకారం ఎక్కువైందని కళ్లు నెత్తికెక్కాయని వైయస్‌ జగన్‌ విమర్శించారు. డబ్బులతో ఎవరినైనా కొనుగోలు చేయవచ్చు..లంచాలతో సంపాదించిన సొమ్మును విసిరేసి ఓట్లు కొనాలనే కుట్ర చేస్తున్నారన్నారు. ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసిన చంద్రబాబు ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని వైయస్‌ జగన్‌ నంద్యాల ప్రజలకు సూచించారు. Back to Top