రాష్ట్రానికి ప్రథమ మోసగాడు చంద్రబాబు

  • బాబుకు మతిస్థిమితం తప్పిందా..?
  • చెప్పేదొకటి, చేసేదొకటి..దేనికీ పొంతన లేదు
  • పేదల బాధలే పట్టడం లేదు
  • లక్షకోట్లు దోచేశారు..రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు
  • రాష్ట్రాన్ని సెంట్రలైజ్ దోపిడీ చేసి..
  •  నీతి, నిజాయితీ అంటూ కబుర్లు చెప్తున్నాడు
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిథి గౌతంరెడ్డి
విజయవాడః రాష్ట్రానికి ప్రథమ మోసగాడు చంద్రబాబు అని వైయస్సార్సీపీ అధికార ప్రతినిథి గౌతం రెడ్డి మండిపడ్డారు. ఈ మూడేళ్లలో చంద్రబాబు,లోకేష్ లు తమ శిష్యులతో కలిసి విచ్చలవిడిగా దోచేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎక్కడ ఖాలీ దొరికితే అక్కడ నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్రాన్ని  అమ్మేందుకు బాబు ముందుకు వచ్చారని ఫైర్ అయ్యారు. మోసగాడు చంద్రబాబు అండ్ కో లక్షకోట్ల అవినీతికి సంబంధించి గతంలోనే బుక్ ప్రింట్ చేసి ఢిల్లీలో ప్రధాని సహా వివిధ పార్టీల నేతలకు అందించిన విషయాన్ని గౌతంరెడ్డి గుర్తు చేశారు. అయితే దీనిపై ఏ సమాధానం ఇవ్వకపోగా, కమిటీలు వేయమని అడిగితే మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని బాబు తీరుపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన అవినీతిపై విచారణకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. 

విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో గౌతం రెడ్డి మాట్లాడుతూ...సంక్షేమాన్ని  విస్మరించి బాబు రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్నటికి నిన్న చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తే మతిస్థిమితం తప్పిందన్న అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. మాట్లాడితే నీతి, నిజాయితీ అనే చంద్రబాబుకు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కనబడడం లేదా అని ప్రశ్నించారు.  ఓకాయన మనుషులను చంపేసి కుక్కకథ చెబుతాడు. ఇంకో అతను రోడ్డుపై వెళ్లే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడతాడు. కొడుకుల ద్వారా మాట్లాడిస్తాడు. స్వయంగా మంత్రుల ఇళ్లలో నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. ఇలాంటి వాళ్లు నీతి కబుర్లు చెప్పడంలో అర్థముందా..? అని నిప్పులు చెరిగారు. దొంగేదొంగ అన్నట్లు బాబు తీరు ఉందని గౌతంరెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని సెంట్రలైజ్ దోపిడీ చేస్తూ చంద్రబాబు నీతి, నిజాయితీ గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. 

అసలు రాష్ట్రంలో సమస్యలే లేవని ఓసారి, సమస్యలు సాల్వ్ అవ్వట్లేదని మరోసారి బాబు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారని గౌతంరెడ్డి విమర్శించారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో సమస్యలు పరిష్కారమవుతాయా...? గంటల కొద్దీ మాట్లాడుతారు. దేనికీ పొంతన ఉండదు. చెప్పేదొకటి, చేసేది ఒకటి..? బాబు తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ అసమర్థత వల్ల 3 లక్షల ఎకరాలకు పైగా పంటనష్టం వాటిల్లిందని, రైతులు పంటలు వేసుకోలేని పరిస్థితి దాపురించిందని గౌతం రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రూ.  14లక్షలకు పైగా ఇళ్లు చేపట్టాలని ఉంటే దానిపైనా ఉలుకుపలుకు లేదు. 4లక్షల ఇళ్లు ఇస్తామన్నారు. ఇంతవరకు బాబు ఒక్క ఇళ్లు కట్టించిన పాపాన పోలేదు. మరమ్మతులు చేసిన వాటికి దిక్కులేదు. గతంలో 45 లక్షల ఇళ్లు మంజూరైతే 25లక్షలు నిర్మాణం జరిగాయి. వాటిలో 19లక్షల ఇళ్లకు ఒక్కరూపాయి కూడా పే చేయలేదు. గొడ్ల పాకల్లో చలికి వణుకుతూ బతుకుతున్న పేదల బాధలు పట్టవుగానీ దేశదేశాలు విమానయానం మాత్రం బాబుకు బాగా కనబడుతుందని ఎద్దేవా చేశారు.  కేంద్రం నుంచి 350 కోట్లు వచ్చాయని, 1,094వేల ఇళ్లు మంజూరు చేసింది ఉంటే వాటికి అతీగతీ లేదని దుయ్యబట్టారు. బాబు మార్కు ఎలా ఉంటుందంటే అన్నింటికీ శంకుస్థాపన చేస్తాడు. ఆయన దేనికైనా సిద్ధహస్తుడని విరుచుకుపడ్డారు. 

నోట్లు రద్దు చేయమని మోడీకి నేనే సలహా ఇచ్చానంటాడు. మళ్లీ నాలుక కర్చుకొని నోట్ల రద్దు మంచి నిర్ణయం కాదని అంటాడు. మళ్లీ ఇకనుండి నగదురహిత రాష్ట్రంగా చేస్తానని మాట్లాడుతాడు. బాబు చెప్పేదానికి, చేసేదానికి దేనికీ పొంతన లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్రాన్ని దోచుకోవడం మాని  ప్రజానీకం అవస్థలు గ్రహించాలని ప్రభుత్వానికి హితభోద చేశారు. డీమానిటైజేషన్ వల్ల 20 వేల ఫ్యాక్టరీలు మూతబడి, 50శాతం ఉద్యోగాలు తీసేసిన పరిస్థితి నెలకొందన్నారు. భారీ పరిశ్రమలు పూర్తిగా నాశనమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బాబు ఆలోచన చేసి డీమానిటైజేషన్ తో ఎంతమంది నష్టపోయారో చెప్పాలన్నారు. బాబు మాటలకు మాత్రమే పరిమితమయ్యాడని, తూతూమంత్రంగా జన్మభూమి కార్యక్రమాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.  జన్మభూమి కార్యక్రమంలో ఇళ్లు, వ్యవసాయం, ఉద్యోగాలు ఇలా ఎన్ని దరఖాస్తులొచ్చాయో బయటపెట్టాలన్నారు. 

తాజా వీడియోలు

Back to Top