కేసుల భయంతో హోదా తాకట్టు

అనంతపురం: ముఖ‍్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని వైయస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. బుధవారం జరిగిన అనంతపురం జిల్లా వైయస్సార్ సీపీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను టీడీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. కేసుల భయంతోనే ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు సర్కారు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు.

Back to Top