చంద్రబాబు షోకుల కోసం జనం భవిష్యత్ బలి

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేస్తున్న షోకుల పరిపాలన..రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతోంది. ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఎడా పెడా దుబారా ఖర్చులు పెడుతుండటంతో ప్రజల భవిష్యత్ అంధకారంగా మారుతోంది.

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖర్చులు కట్టలు తెంచుకొన్నాయి. చీటికి మాటికి గుంపులు, గుంపులుగా విదేశాలకు ప్రయాణించటం, ఇందుకోసం ప్రత్యేక విమానాల్ని తీసుకొని వెళ్లటం, హైదరాబాద్ లో కార్యాలయాలు, విజయవాడలో నివాసాలు, కాన్వాయ్ లు ..ఇలా ఖర్చులు లెక్క లేకుండా పెరిగిపోయాయి. ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించుకొన్న చంద్రబాబు తర్వాత కూడా అదే ధోరణిలో కొనసాగారు.  పుష్కరాల ద్వారా దేశ వ్యాప్తంగా ప్రతిష్ట పొందాలనుకొన్న ఉద్దేశంతో 16 వందల కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టారు. అందులో చంద్రబాబు సినిమా పిచ్చి కోసం 29మంది చనిపోవటంతో మరింత కసిగా అమరావతి శంకుస్థాపన కు 400 కోట్లు మంచి నీళ్లలా ఖర్చు పెట్టేశారు. ఈ విధంగా డబ్బులు వెదజల్లటంతో పాటు తెలుగు తమ్ముళ్లకు అనేక చోట్ల నామినేషన్ పద్దతిలో రక రకాల పనులు అప్పగించేస్తున్నారు. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్ప లా మారిపోయింది.

ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న ఆదాయం నెలకు రూ. 5వేల కోట్లు

ప్రతీ నెలా ఖర్చులు తక్కువలో తక్కువ చూసుకొన్నా రూ. 7వేల కోట్లు

అంటే ప్రతీ నెల రూ. 2వేల కోట్ల మేర లోటు బడ్జెట్ తో ప్రభుత్వం నడుస్తోంది. ఆర్థిక పరిస్థితి ఇంత దయనీయంగా వ్యవస్థను గాడిలో పెట్టాల్సింది పోయి చంద్రబాబు షోకులకు తగలేస్తున్నారు. ప్రతీ నెల ఈ లోటు అంతకంతకూ పెరుగుతూ వెళుతోంది. అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయటం, వడ్డీలు కట్టేందుకు తిరిగి ఎక్కువ వడ్డీలకు అప్పులు చేస్తూ వెళుతున్నారు. దీంతో రాష్ట్ర భవిష్యత్ అంధకారంలో పడుతోంది. 

Back to Top