రైతుల ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం అధ్య‌క్షుడు ప్రసాదరెడ్డి
వైయ‌స్ఆర్ జిల్లా( వీరపునాయునిపల్లె):  కరువుతో సతమతమవుతున్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైయ‌స్ఆ ర్‌సీపీ రైతు విభాగం వైయ‌స్ఆర్‌ జిల్లా అధ్య‌క్షుడు సంబటూరు ప్రసాదరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మండల పరిధిలోని పాలగిరి, మిట్టపల్లె,గంగిరెడ్డిపల్లె, మూయిళ్లచెరువు తదితర గ్రామాలలో తెగులుతో దెబ్బతిన్న పత్తి పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 18వేల హెక్టారులలో పత్తి పంట తెగులు కారణంగా ఎండిపోతోందని, రైతులుఎకరాకు దాదాపు రూ30వేల వరకు ఖర్చు చేయడం జరిగిందని, అయితే విది లేక పంటను తొలగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం పత్తి రైతులకు ఎకరాకు రూ30వేల నష్టపరిహారం అందచేయాలని డిమాండ్‌చేశారు.కరువుతో రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు అందాల్సిన పంటల భీమా, రుణమాషీ కూడా సకాలంలో రైతులకు అందడం లేదని,రైతులను గురించి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌రఘునాధరెడ్డి, పాలగిరి సర్పంచు జంగంరెడ్డి, ఎంపీటీపీలు రవి, చెండ్రాయుడు, నాయకులు శంభురెడ్డి, చెన్నకేశవరెడ్డి తదితరులుపాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top