శ్రీకాకుళం: ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు, రైతులకు, డ్వాక్రా మహిళలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావుధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందన్నారు. దీనిపై ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటానికి పార్టీ అధినేత జగన్ ఈనెల 31, వచ్చే నెల ఒకటో తేదీన పశ్చిమగోదావరి జిల్లా తణుకులోరైతుదీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. <br/>