దళితుల భూములు లాక్కుంటే ఖబడ్దార్..!

హైదరాబాద్ : వైఎస్సార్సీపీ నేత, పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ మేరుగ నాగార్జున ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాజధాని ప్రాంతంలో దళిత గిరిజనుల భూములను లాక్కుంటూ చంద్రబాబు వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నాగార్జున మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా దళితులకు ఇచ్చిన భూములను అప్పనంగా దోచుకుంటున్నారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బినామీల పేరుతో ఆభూములను తమ వశం చేసుకుంటున్నారని ఆరోపించారు. 

దివంగత ముఖ్యమంత్రి వైస్. రాజశేఖర్ రెడ్డి దళితులకు ఆరున్నర లక్షల ఎకరాలు పంపిణీ చేశారని, ఎస్టీలకు 20 లక్షలకు పైగా ఎకరాలు ఇచ్చి ప్రపంచంలోనే రికార్డు సృష్టించారని నాగార్జున ఈసందర్భంగా గుర్తుచేశారు. కానీ చంద్రబాబు దళితుల భూములు లాక్కొని రికార్డు సృష్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. దళితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని నాగార్జున తెలిపారు. దళితుల భూముల జోళికొస్తే తస్మాత్ జాగ్రత్త అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Back to Top