మేకవన్నె పులి..తేనెపూసిన కత్తి

తప్పులు చేయడం తప్పించుకోవడం చంద్రబాబు నైజం
బాక్సైట్ పై చంద్రబాబు దొంగాట
ఆదివాసీల జీవితాలతో ఆటలు

రెండు
నాల్కల ధోరణి, రెండు కళ్ల సిద్ధాంతం. అబద్ధాలు, మోసాలు, వెన్నుపోటులు.
ఇవన్నీ కలబోసిన నాయకుడే చంద్రబాబు. అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే
మరొకలా వ్యవహరించడం చంద్రబాబు నైజం. తప్పు చేయడం అది బయటపడేసరికి ఆనెపం
వేరే వారిమీద నెట్టేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అందుకు
మచ్చుతునకలెన్నో. 

ప్రతిపక్షంలో
ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయాలన్న చంద్రబాబు..అధికారంలోకి
వచ్చాక అదే తవ్వకాలకు అనుమతిలిస్తూ జీవో  తీసుకొచ్చాడు. తీవ్ర వ్యతిరేకత
రావడంతో నాటకాలు మొదలుపెట్టాడు.  జీవో ఇచ్చినట్లు తనకు తెలియదే అంటూ
బుకాయిస్తుూ యూటర్న్ తీసుకున్నాడు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఏ జీవో అయినా
అడుగు ముందుకు పడుతుందా...? బాధ్యతగల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు
మాట్లాడుతున్న మాటలను సమాజంలోని ప్రతి ఒక్కరూ  చీధరించుకుంటున్నారు. ఇలాంటి
ముఖ్యమంత్రినా గెలిపించిందని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రజలు
అమాయకులు, ఏం చెప్పినా చెల్లుతుందన్న ధోరణిలో చంద్రబాబు మోసాలు
సాగిస్తుంటారు. 

జీవ
రద్దు అన్నది చంద్రబాబు చేతుల్లో ఉన్నా...నిలుపుదల చేయడంలో మర్మమేంటి.
పైకి చిలుక పలుకులు పలుకుతూ శ్వేతపత్రం విడుదల దేనికి సంకేతం. అసలు ఆ జీవో
నం.97 చంద్రబాబు ఎవరికోసం తీసుకొచ్చారు. ఎంత మేర ముడుపులు అందాయన్నది
అంతుచిక్కని వ్యవహారం. ఓ వైపు గిరిజనుల మనోభావాలు దెబ్బతీయనంటూనే..తేనె
పూసిన కత్తిలా బాక్సైట్ తవ్వకాలకు చంద్రబాబు తెరవెనుక ప్రయత్నాలు
చేస్తున్నాడు.  మొన్నటి ఆదివాసీల సదస్సును పోలీసులను ఉసిగొల్పి
అడ్డుకున్నారు. గిరిజనులకు అండగా పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్షం
వైఎస్సార్సీపీపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. బాక్సైట్ తవ్వకాలను రాష్ట్ర
ప్రజానీకమంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నాచంద్రబాబు మొండి వైఖరి వీడడం లేదు. 

విశాఖ
బాక్సైట్ లీజులకు ఆద్యుడు చంద్రబాబే. 1995లో పదవి చేపట్టగానే ఆయన బాక్సైట్
నిక్షేపాలపై కన్నేశారు. నిబంధనలను మార్చి, గిరిజనులను ఏమార్చి 2000లోనే
దుబాయ్ కంపెనీ ప్రతినిధులను తీసుకొచ్చి బాక్సైట్ ఒప్పందాలు
కుదుర్చుకున్నారు. ఆ నిజాలన్నీ దాచి ఇపుడు వైఎస్ రాజశేఖరరెడ్డిపై బురద
జల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్లు
రాజన్నహయాంలో బాక్సైట్ తవ్వకాలు జరిగాయనేది శుద్ధ అబద్దం. ఇన్నేళ్లు అక్కడ
బాక్సైట్ తవ్వకాలు జరగనేలేదు. ఒక్క తట్ట కూడా బాక్సైట్‌ను ఎత్తి పోయలేదు.
చంద్రబాబు 2004 ఎన్నికల్లో గెలిచినట్లయితే దుబాయ్ కంపెనీతో కుదుర్చుకున్న
ఒప్పందం మేరకు బాక్సైట్ తవ్వకాలతో యథేచ్ఛగా దోపిడీ సాగించేవారే. ఆయన
ఓడిపోవడంతో వినాశకరమైన దుబాయ్ ఒప్పందాలకు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ
బాక్సైట్ ను దోచుకునేందుకు గిరిజనుల హక్కులు, చట్టాలన్నీ తుంగలో తొక్కుతూ
చంద్రబాబు దొంగదారులు వెతుకుతున్నారు.
Back to Top