మోసాలు చేయడం చంద్రబాబుకే సాధ్యం

అచ్చంపేట ః మోసాలు చేయడం, అలవికాని హామీలు ఇవ్వడం, అధికారలోకి వచ్చి ఏమీ చేయకుండా అన్ని వర్గాలవార్ని మోసం చేయడం సీయం చంద్రబాబుకే సాధ్యం అని వైయస్సార్‌ సిపి మండల కన్వినర్‌ సందెపోగు సత్యం అన్నారు. వైయస్సార్‌ సిపి అధినేత వైయస్ జగన్‌మోహనరెడ్డిపై స్థానిక టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలను మండల వైయస్సార్‌ సిపి నాయకులు తిప్పికొట్టారు. శనివారం స్థానిక పడమరబజారు మసీద్‌ సెంటర్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. సత్యం మాట్లాడుతూ వైయస్సార్‌ సిపి అధికారంలోకి రాగానే ప్రకటించిన నవరాత్నాలు పథకాలను తప్పక అమలు పుస్తారని, సాధ్యాసాధ్యాలను చర్చించిన మీదటే హామీ ఇవ్వడం జరిగిందన్నారు. చంద్రబాబులా అలవికాని 600 హామీలు ఇచ్చి ఏ వక్కటీ నెరవేర్చకపోవడం జగన్‌మాహనరెడ్డి వల్లకాదన్నారు. నవరత్నాలును ఏ విధంగా అమలు చేయవచ్చోకూడా వివరించిన ఘనత జగన్‌మోహనరెడ్డిదన్నారు. తమకు అనుకూలపత్రికలలో జగన్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం మానకోవాలని, దమ్ము,ధైర్యం ఉంటే చేసిన అభివృద్దిపై బహిరంగ చర్చకు సిద్ధపడాలన్నారు.

తాజా ఫోటోలు

Back to Top