ప్రజాధనంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం..!

చిత్తూరు(పుంగనూరు) : రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి మండిపడ్డారు.  శంకుస్థాపన కోసం  ఖర్చు చేస్తున్న రూ.400 కోట్లను ఎక్కడి నుంచి తెచ్చారని చంద్రబాబును నారాయణస్వామి ప్రశ్నించారు. అది ప్రజాధనం కాదా అని నిలదీశారు. పుంగనూరులో వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయ సాధన కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని నారాయణస్వామి చెప్పారు. ప్రత్యేకహోదా వచ్చేదాకా వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. .

Back to Top