రాయలసీమ ప్రాజెక్టులపై చిత్తశుద్ధి చూపని సీఎం

– అసెంబ్లీలో ప్రతిపక్షానికి మైక్‌ ఇవ్వని వైనం
– అధికమైన అధికార పార్టీ ఆరాచకాలు
– ద్వజమెత్తిన ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి

కమలాపురం అర్బన్‌ః 2017–18 రాష్ట్రానికి చెందిన వార్షిక బడ్జెట్‌లో గాలేరు– నగరి ప్రాజెక్టుకు అరకొర నిధులు కేటాయింపులే జరిగాయని ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ జిఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టుకు రూ 1300 కోట్లు కేటాయించి మొదటి ఫేజ్‌ను పూర్తి చేయాలని పలుమార్లు డిమాండ్‌ చేసినా ప్రభుత్వం బడ్జెట్‌లో నామమాత్రపు నిధులు కేటాయించిందన్నారు. పెండింగ్‌లో ఉన్న రాయలసీమ ప్రాజెక్టులపై సీఎంచంద్రబాబుకు చిత్తశుద్ధి లేదనేది మరోసారి రుజువు అయిందన్నారు. గండికోటకు జూన్‌ నాటికి నీరు ఇస్తామని ఒకవైపు చెబుతూ బడ్జెట్లో నిధుల కేటాయింపు చూస్తుంటే అధికార పార్టీకి రాయలసీమ ప్రజలు, ప్రాంత అభివృద్దిపై ఆసక్తి లేదన్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరు తెచ్చామని గోప్పలు చెబుతున్నారే గాని ఆ ప్రాజెక్టు వలన ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఆ ప్రాజెక్టు కేవలం కమీషన్లు, లంచాల కోసమే నిర్మించారని విమర్శించారు. ఎక్కడ కమీషన్లు దొరుకుతాయో ఆ పనులకు బాబు ఆగమేఘాలపై జివోలు ఇస్తుంటారని ఆరోపించారు. గోదావరి– పెన్నా నదుల అనుసందానం చేసి రాయలసీమకు నీరు ఇస్తామని చెబుతున్నారు గాని రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నిరుద్యోగులకు మోసం చేసి బాబు మాత్రం తన కుమారుడు లోకేశ్‌కు జాబు ఇచ్చారని ఎద్దువా చేశారు. అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షానికి మైక్‌ ఇవ్వక పోవడం చాలా సిగ్గు చేటన్నారు. అధికార పార్టీ నాయకులు ఆరాచకాలు ఎక్కడ ప్రజలు, ప్రపంచానికి తెలుస్తాయో అనే భయంతో ప్రతిపక్షనేతకు మైక్‌ ఇవ్వకుండా అధికార పార్టీ వారు పదేపదే అడ్డుతగలడం ఎక్కడ చూడలేదన్నారు. ప్రజలు జరుగుతున్న ఆరాచకాలను గమనిస్తున్నారని త్వరలో టీడీపీకి బుద్ది చెబుతారన్నారు.

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
స్థానిక వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయం ఎదుట జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ ఉత్తమారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మారుజొళ్ళ శ్రీనివాసరెడ్డి, నల్లింగాయపల్లె సింగల్‌ విండో ప్రసిడెంట్‌ రాజుపాళెం సుబ్బారెడ్డి, పి.వి. కృష్ణారెడ్డి, మండల రైతు సంఘం నాయకుడు మునిరెడ్డి, ట్రెజరర్‌ సుదా కొండారెడ్డి, ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు ఖాదర్‌ హుస్సేన్, ఖాజాహుస్సేన్, అంబటి సురేష్, మాజి సర్పంచ్‌లు దేవదానం, అట్ల సుబ్బిరెడ్డి, రామలక్ష్మణ్‌రెడ్డి, జెట్టి నగేష్,తదితరులు పాల్గొన్నారు.

Back to Top