నంద్యాలలో రూ.200 కోట్లు పంచిన చంద్రబాబు

చిత్తూరు: నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటర్లను రేషన్‌ కార్డులు, పింఛన్లు తొలగిస్తామని బెదిరింపులకు గురిచేసి ఓట్లు వేయించుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. చిత్తూరులో నవరత్నాల సభలో భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. నంద్యాల ఫలితాలు చూసి పార్టీ శ్రేణులు, ప్రజలు భయపడాల్సిన పనిలేదని, మూడేళ్లుగా విచ్చలవిడిగా సంపాదించిన అవినీతి సొమ్మును వరదలా పారించడం వల్లే టీడీపీ గెలుపొందిందన్నారు. నోట్ల రద్దు తరువాత సామాన్య ప్రజలు రూ. 2 వేల నోటు చూడటానికి పదిహేను రోజులు పట్టిందని, కానీ చంద్రబాబుకు లారీల కొద్ది డబ్బును నంద్యాలలో దించారన్నారు. అంటే ఎంత దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నాడో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. డబ్బులు పంచి ఓటర్లను కొనుగోలు చేయగలను అని నంద్యాల గెలుపును చూసి చంద్రబాబు వి్రరవీగితే పొరబాటని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం కచ్చితంగా చెబుతారన్నారు. 

Back to Top