సీఎంగా చంద్ర‌బాబు అన‌ర్హుడు

కొయ్యలగూడెం: ప్రజాస్వామ్య వ్యవస్థ‌కి గొడ్డలి పెట్టుగా వ్యహరించిన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పాలనకు అనర్హుడని వెంటనే రాజీనామా చెయ్యాలని వైయ‌స్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన శుక్రవారం కొయ్యలగూడెంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. స్టేట్‌హైవేపై గణేష్ సెంటర్‌లో నిర్వహించిన రాస్తారోకోలో రోడ్‌పై భైఠాయించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి వెంటనే కలుగచేసుకుని గవర్నర్‌ని రీకాల్ చెయ్యాలని బాలరాజు డిమాండ్ చేశారు. కొడుకు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తే తండ్రి నియంతలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు, లోకేష్‌లనుద్దేశించి బాలరాజు విమర్శలు సంధించారు. సీఎం లో కాని, పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు పొందిన ఎమ్మేల్యేలోకాని నిజాయితీ ఉంటే పదవులకు రాజీనామాచేసి ఎన్నికలకి వెళ్లి ప్రజాతీర్పులో తాడోపేడో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 

Back to Top