నీచ‌రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ బాబు

ఉదయగిరి (నెల్లూరు): చ‌ంద్ర‌బాబు నాయుడు నీచ రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అని మాజీ ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం అతిథి గృహంలో విలేక‌రుల‌తో మాట్లాడుతూ చంద్ర‌బాబుకు నంద్యాల‌లో ఓడిపోతాయ‌మ‌ని భ‌యం ప‌ట్టుకుంద‌న్నారు. అందుకే ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌పై దుష్స్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.  ఈ నెల 3న నంధ్యాలలో జరిగిన జగన్‌ బహిరంగ సభకు ఊహించని విధంగా ప్రజలు తరలిరావడంతో దీనిని జీర్ణించుకోలేని టీడీపీ ఆ సభలో సందర్భోచితంగా మాట్లాడిన ఒక చిన్న మాటను పట్టుకొని రాద్ధాంతం చేయడం చూస్తే ఆ పార్టీకి ఓటమి భయం ఎంతగా పట్టుకుందో అర్థమౌతోందన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌లో గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే వారిచేత  చంద్రబాబు రాజనామా చేయించకుండా అందులో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టి నైతిక విలువలు, రాజ్యాంగ విలువలను దిగజార్చారన్నారు. శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న సందర్బంగా ఆయన వైసీపీలో చేరితే ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజనామా చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు హ‌ర్షిస్తున్నార‌న్నారు.

Back to Top