అవినీతికి కేరాఫ్‌ చంద్రబాబు

అనంతపురం: చంద్రబాబు అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబుతో సహా ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారని విమర్శించారు. అనంతలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీలో భాగస్వాములయ్యేందుకు ముందుకు వస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top