వైఎస్ విగ్రహ ధ్వంసం చంద్రబాబు కుట్రే!

మంత్రి సునీత నియోజవర్గంలో ఇలా జరగడం దారుణం
కారకులను కఠినంగా శిక్షించాలి
ఎస్పీని కోరిన వైఎస్సార్ సీపీ నాయకులు


అనంతపురం: దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. వీటిని తొలగింప చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్ర పన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఉన్న చోటు, జాతీయ రహదారుల వద్ద ప్రజలకు ఇబ్బంది కలిగించే విగ్రహాలను మాత్రమే తొలగించాలని హైకోర్టు చెప్పింది. చంద్రబాబు మాత్రం వైఎస్ విగ్రహాలను టార్గెట్ చేస్తూ... అనుమతి లేనివన్నీ తొలగించాలని అధికారులను ఆదేశించారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకర్‌నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, సీజీసీ సభ్యుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయ కర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తదితరులు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబును ఆయన కార్యాలయం లో కలిశారు. కనగానపల్లి మండలం తగర కుంటలో ఈ నెల 6వ తేదీ రాత్రి వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మంత్రి పరిటాల సునీత నియోజకవర్గంలో ఈ ఘటన జరగడంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. దుండగులు విగ్రహాన్ని కూల్చేందుకు మందు గుండు సామగ్రి తెచ్చుకోవడం చేస్తే ఉద్దేశ పూర్వకంగానే చేశారన్నారు. ఇలాంటి ఘటనల వల్ల జిల్లా ప్రశాంతతకు భంగం కలుగుతుందన్నారు.

Back to Top