చంద్రబాబు మోసాలు

హైదరాబాద్: చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసగించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు. 

చంద్రబాబును నమ్మి మోసపోయామని రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇలా ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు.రైతుల రుణమాఫీపై ఎన్నో ఆంక్షలు విధించారని విమర్శించారు. బాబు చేసిన మాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదని చెప్పారు. వ్యవసాయ రుణాలమాఫీపై చంద్రబాబు చేసిన తొలిసంతకం పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చలో కాకాని మాట్లాడుతూ.. గత బడ్జెట్ అంచనాలకు, వాస్తవాలకు పొంతన లేదని అన్నారు. ద్రవ్యవినిమయ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది.
Back to Top