మళ్లీ అవే మోసాలు..బాబుకు బుద్ధి చెప్పండి

  • అధికార అహంకారంతో బాబు కళ్లు నెత్తికెక్కాయి
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచాడు
  • అన్ని వర్గాల ప్రజలను వంచించాడు
  • అవసరానికి వాడుకోవడం..ఆ తర్వాత వదిలేయడం బాబు నైజం
  • అవినీతి సొమ్ముతో మీ దగ్గరకు వచ్చి జేబులోరూ.5వేలు పెడతాడు
  • లౌక్యంగా ఆలోచించండి..న్యాయం వైపు నిలబడండి
  • మీ అందరి దీవెనలు శిల్పా మోహన్ రెడ్డికి అందించండి
మసీద్ సెంటర్ః అధికార అహంకారంతో చంద్రబాబుకు కళ్లు నెత్తికెక్కాయని వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొన్నట్టే ప్రజలను డబ్బులను కొంటానన్న అహంతో ఉన్నాడని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని చంద్రబాబు పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని, మరోసారి మోసం చేసేందుకు నంద్యాలకు వస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గపు పాలన మనకు అవసరమా అని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. బాబు మోసాలు, అవినీతి, అన్యాయ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మీ అందరి చల్లని దీవెనలు వైయస్సార్సీపీ అభ్యర్థి మోహన్ రెడ్డికి అందించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైయస్సార్సీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా మసీద్ సెంటర్ లో వైయస్ జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే....

ఇవాళ నంద్యాలలో ఉపఎన్నికల్లో మనం వేసే ఓటు ఎవరో వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసుకునేందుకు ఓటు వేయడం లేదు. మూడున్నరేళ్ల  బాబు మోసాలకు, అన్యాయానికి, అవినీతి, దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయండి. మూడున్నరేళ్లుగా బాబును మీరు చూశారు. ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన చేసిన అన్ని మోసాలను విన్నారు. బాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చలేదు.  రైతులను, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను మోసం చేశాడు. చదువుకునే పిల్లలు, ఉద్యోగాల కోసం వెతుక్కునే వారిని వదల్లేదు. జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. ఏ టీవీ చూసినా, ఏ గోడల మీద చూసినా అవే రాతలతో ఊదరగొట్టారు. ఉద్యోగం లేనవారికి ప్రతి ఇంటికి నెలకు రూ.2వేలునిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. బాబు ముఖ్యమంత్రి అయి 38నెలలయింది. నెలకు రూ.2వేల చొప్పున బాబు ప్రతి ఇంటికి రూ.76వేలు బాకీ ఉన్నాడు. మూడున్నరేళ్ల తర్వాత అడుగుతున్నా..? ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా..? అని ప్రశ్నించారు. అంటే లేదు అని ప్రజలు సమాధానమిచ్చారు. 

పొదుపు సంఘాల మహిళలకు సంబంధించి రూ. 14వేల కోట్లు రుణాలు మాఫీ అన్నాడు. మూడున్నరేళ్ల తర్వాత అక్కచెల్లెమ్మలను అడుగుతున్నా..ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా..? అందరినీ మోసం చేశాడు. ప్రతి పేదవాడికి 3సెంట్ల స్థలం, ఇళ్లు కట్టిస్తానన్నడు. మూడున్నర సంవత్సరం తర్వాత అడుగుతున్నా...ఒక్క ఇళ్లైనా కట్టించాడా..? అంటే లేదు అని ప్రజలు సమాధానమిచ్చారు. రేషన్ షాపుకు పోతున్నారు కదా..? బాబు ముఖ్యమంత్రి కాకముందు కిరోసిన్, చక్కెర, పామాయిల్, కందిపప్పు, గోదుమపిండి ఇచ్చేవాళ్లు. బాబు వచ్చాక మూడున్నరేళ్ల తరువాత అడుగుతున్నా..? బియ్యం తప్ప ఏమైనా ఇస్తున్నారా?ఏదీ  ఇవ్వడం లేదు. దివంగత మహానేత వైయస్ఆర్ పరిపాలనను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. పేదవాడు అప్పులపాలు కావడానికి రెండే కారణాలుంటాయని నమ్మాడు. ఇంజినీరింగ్, డాక్టర్లు లాంటి పెద్దపెద్ద చదువులు చదవాలంటే పేదవాడు అఫ్పులపాలయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి పేదవాడికి రాకూడదని దేశంలో ఎక్కడ లేనివిధంగా ఫీజు రీయింబర్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు.  నీవు ఏం చదువుతావో చదువు అని తోడుగా ఉన్నాడు. ఇవాళ ఇంజినీరింగ్ చదవాలంటే బాబు పుణ్యాన సంవత్సరానికి లక్ష రూపాయలు అవుతోంది. కానీ, ఆయన  ముస్టేసినట్టు రూ.35 వేలు ఇస్తున్నాడు. మిగిలిన రూ.65 వేలు కట్టాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు మళ్లీ ఆస్తులు, బంగారం అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పాలన మనకు కావాలా అన అడుగుతున్నా. మన పిల్లలను చదివించుకునేందుకు ఆస్తులు  అమ్ముకోవాలా..? 

పేదవాడి కుటుంబం ఆస్పత్రి పాలైనప్పుడు కాపాడుకోవడం కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని బతికించుకునే కార్యక్రమం చేస్తారు. ఆస్పత్రికి పోతే అప్పుల పాలు కూకూడదని  చిరునవ్వుతో వెళ్లి గర్వగా ఇంటింకి రావాలని వైయస్ఆర్ భావించారు.  108 ఫోన్ కొడితే చాలు కుయ్ కుయ్ కుయ్ అంటూ 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేట్టుగా చేశారు.  బాగోలేని వ్యక్తిని  కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి ఉచితంగా వైద్యం చేయించి చిరునవ్వుతో ఇంటికి వచ్చేలా చేశారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైయస్ఆర్ చేశారు. ఇవాళ ఆరోగ్య శ్రీ పథకాన్ని బాబు పూర్తిగా నీరుగార్చాడు. ఇవాళ  108కు ఫోన్ కొడితే డీజిల్ కు డబ్బులు లేవని వినిపిస్తోంది. డ్రైవర్లు స్ట్రైక్ మీదున్నారని వినిపిస్తోంది. పేదవాడు పోయే ఆస్పత్రులకు డబ్బులివ్వరు. బకాయిలు కట్టరు. మూగ, చెవుడు ఆపరేషన్ చేయించాలంటే 6లక్షలు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదని వైయస్ఆర్ ఆనాడు ఖరైదన వైద్యం చేయించారు. బాబు అంటాడు. చెవుడు, మూగ సంవత్సరం లోపే కనుక్కోవాలట. చిన్నపిల్లాడికి సంవత్సరంలోపు చెవుడు, మూగ కనుక్కోగలమా..?కనుక్కోలేకపోతే అలాగే బతకాలట. కిడ్నీ బాగోలేకపోతే డయాలసిస్ చేయించుకోవాలి. ఒక్కోసారికి రూ. 2వేలు అవుతుంది. వారానికి రెండు, మూడు సార్లు చేయాలి. నెలతిరిగేసరికి రూ. 20వేలు అవుతుంది. ఆస్పత్రికి పేషెంట్ పోతే ఏడాది తర్వాతరమ్మంటున్నారు. ఇది బాబు పాలనలో  ఆరోగ్య పరిస్థితి. క్యాన్సర్ పేషెంట్లకు కీమోథెరపీ 8,9సార్లు చేయించాలి. బాబు హయాంలో ఆరోగ్యశ్రీ ఎలా ఉందంటే రెండుసార్లేనట. ఆరునెల తర్వాత మళ్లీ తిరగబడి పైకి పోయే పరిస్థితి. ఇలాంటి పాలన మనకు కావాలా అని అడుగుతున్నా..? బాబు పాలనలో ఇచ్చిన మాటలన్నీ తప్పాడు. సంక్షేమ పథకాలకు కత్తిరింపులు విధించాడు. ఎవరూ సంతోషంగా లేరు. ప్రతి సామాజిక వర్గం బాబు మాటలు నమ్మి మోసపోయింది. 

నాకు ఓ స్నేహితుడు నోట్ ఇచ్చాడు. చంద్రబాబు రాజకీయాలు చూసి ఎలాంటోడని నోట్ రాశాడు. చంద్రబాబు డిగ్రీ చేశాడు. దేంట్లో డిగ్రీ చేశాడంటే... మోసం చేయడంలో డిగ్రీ చేశాడు. కులాలు, మతాల పేరిట మనుషులను వాడుకోవడం..పనిఅయ్యాక విసిరేయడం. ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు మన కళ్లకు గంతలు కట్టేస్తాడు. ఇంద్రలోకం అదిగో అని చూపిస్తడు. ఆయనకు సపోర్ట్ చేసే చానళ్లు, పేపర్ లు ఓహో ఆహా అని బాబును పైకి ఎత్తేస్తాయి. ఎన్నికలయ్యాక అందరినీ పక్కనబెట్టేస్తడు. నిలదీస్తే బండలు వేస్తడు. కాస్త గట్టోడిగా ఉన్నాడనుకో ఎక్కడ లేనివిధంగా గోబెల్స్ ప్రచారం చేస్తడు. లేనిది ఉన్నది కలిపి ప్రచారం చేసి రాక్షసానందం పొందుతాడు. 2014 ఎన్నికలు బాబుకు డౌటుగా ఉంది. పొత్తుకు మోడీ ఒప్పుకుంటడో లేడోనని. అప్పుడు బాబుకు మైనారిటీస్ మీద కన్నుపడింది.  కాకినాడలో ఎలక్షన్స్ వస్తున్నాయని కాపులను పిలిచినట్టు  అప్పుడు మైనారిటీస్ ను ఆత్మ సమ్మేళనానికి పిలిచాడు. ఈనాడు కటింగ్. ఆరోజు బాబు ఏమన్నడో తెలుసా..? మైనారిటీలకు 15 సీట్లు ఇస్తాం.  విద్యలో 10 శాతం ఇస్తాం. ఉద్యోగాల్లో 6శాతం రిజర్వేషన్లు ఇస్తాం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తాం. రూ.2,500కోట్లతో సబ్ ప్లాన్ ప్రకటింటాడు. మూడున్నరేళ్ల తర్వాత అడుగుతున్నా..?  రూపాయైనా ఇచ్చాడా అని అడుగుతున్నా. బాబు గురించి చెప్పాలంటే కాపులు, మైనారిటీలు, బీసీలు ఎస్సీ, ఎస్టీ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య కులాలు అందరినీ వాడుకోవడం, ఆ తర్వాత వదిేలేయడం. ఎన్నికలొచ్చిన ప్రతి సారి ఎన్నిసార్లైనా ఇదే పని చేస్తడు. రాష్ట్రంలో బాబు గురించి ప్రతి ఒక్కరూ ఇదే ఆలోచన చేస్తున్నారు.

చంద్రబాబు గురించి పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుసా..? జామాత దశమ గ్రహ. మనకున్నది తొమ్మిది గ్రహాలు.  ఈయన పదో గ్రహం. యూట్యూబ్ లోకి వెళ్లి జామాత దశమగ్రహ అని కొడితే ఎన్టీఆర్ వీడియో వస్తుంది. పదవి, అధికారం కోసం ఎందుకిలా గడ్డితింటున్నావని ఎన్టీఆర్ చంద్రబాబుని అడిగాడు. నా రక్తం పంచుకుపుట్టిన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే తండ్రిలాంటి నన్ను ఎలా ద్రోహం చేశాడో చూడండి అన్నాడు.
ఎన్టీఆర్ కుర్చీ లాక్కున్నడు.  ముఖ్యమంత్రి పదవి, పార్టీ గుర్తు, ఎన్టీఆర్ ట్రస్ట్ లాక్కున్నాడు. మామ కుర్చీనే లాగినోడికి ప్రజలో లెక్కా. 
కర్నూలుకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలను మోసం చేశాడు. ఇవాళ నంద్యాలస్మార్ట్ సిటీ అంటున్నాడు. ఆనాడు కర్నూలులో స్మార్ట్ సిట్ అన్నాడు. మీకు కనబడిందా. ..?ఫుడ్ పార్కు, గుండ్రేవుల ప్రాజెక్ట్, అవుకు దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ ఇలా అనేక హామీలు గుప్పించాడు.  ఎక్కడైనా కనిపించాయా..? మూడున్నరేళ్ల తర్వాత అడుగుతున్నా. వీటిలో ఒక్కటైనా చేశాడా అని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తికి నంద్యాలలో ఉపఎన్నికలున్నాయని, వైయస్సార్సీపీ పోటీ పెట్టిందనగానే  ప్రజలు గుర్తుకువచ్చారు. అదే మోసాలు, వాగ్ధానాలు. ఇలాంటి వ్యక్తికి మనం ఓటు వేస్తే...రేపు  ప్రతి ఇంటికి మారుతీకారు అంటడు. ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటడు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. మోసం చేయడం తప్పన్నది నాయకులకు తెలియాలి. ఇటువంటి నాయకులు చెప్పింది చేయకపోతే ప్రజలు కాలర్ పట్టుకొని నిలదీస్తారన్న భయం ఉండాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. 

న్యాయం వైపు నిలబండి. చంద్రబాబు మాదిరి నా దగ్గర డబ్బులు, అధికారం, పోలీసు బలగం లేదు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించే చానళ్లు, పేపర్లు లేవు. నాకున్న ఆస్తి. ఆ దివంగత నేత వైయస్ఆర్ ఎనిమిదేళ్ల కిందట చనిపోతూ ఇచ్చిన ఇంత పెద్ద కుటుంబమే నా ఆస్తి. వైయస్ఆర్ చనిపోయి ఏనిమిదేళ్లవుతున్నా ఆయన బతికున్నప్పుడు చేసిన మంచి, సంక్షేమ పథకాలు ఇవాళ్టికి ప్రతి గుండెలో బతికుండడం నా ఆస్తి. జగన్ మోసం చేయడు. జగన్ అబద్ధం ఆడడు. జగన్ ఏదైనా చెబితే కచ్చితంగా చేస్తాడన్న విశ్వసనీయత నాకున్న ఆస్తి అని గర్వంగా చెబుతా. జగన్ వాళ్ల నాన్న మాదిరిగానే పేదవాడికోసం తపిస్తున్నాడు. నవరత్నాలు ప్రకటించాడు. అవకాశమనిస్తే జగన్ కూడ వాళ్ల నాన్న మాదిరిగానే మంచి పేరు తెచ్చుకుంటాడన్న నమ్మకం నా ఆస్తి. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులే నా ఆస్తి. రాబోయే రోజుల్లో బాబు మీదగ్గరికి వస్తడు. ఇప్పటికే మొదలుపెట్టాడు. మూడున్నరేళ్లుగా బాబు విపరీమతైన అవినీతి చేశారు. మట్టి నుంచి ఇసుకదాకా, మద్యం ఇరిగేషన్,  గుడిభూములు, రాజధాని, విశాఖ భూములు దేన్నీ వదల్లేదు. విపరీతంగా సంపాదించిన అవినీతి సొమ్ముతో మీ
దగ్గరకు వస్తడు.  జేబులోంచి దేవుని ఫోటో తీసి ప్రమాణం చేయించుకొని రూ.5వేలు మీ చేతిలో పెడతడు. ఏ దేవుడు పాపానికి ఓటేయమని చెప్పడు. దెయ్యాలు మాత్రమే అలా చేస్తయి. ఆ దెయ్యాలు మీ దగ్గరకు వస్తయి. ధర్మం వైపే ఉంటామని మనసులో తలచుకోండి. లౌక్యంగా వ్యవహరించండి. ఓటు మాత్రం ధర్మానికి, న్యాయానికే వేయండి. ఈ ఎన్నిక ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న అర్థం తీసుకొచ్చేందుకు పోరాటం జరుగుతుంది. మీ అందరి చల్లని దీవెనలు శిల్పా మోహన్ రెడ్డికి, వైయస్సార్సీపీకి అందించండి.


Back to Top