చంద్రబాబు మోసగాడు, దగాకోరు

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆగ్రహం
గిరిజనులను మోసగిస్తున్న రావెల కిషోర్ బాబు..
కొత్తపల్లి గీతలు రాజీనామా చేయాలని ఈశ్వరి డిమాండ్
బాక్సైట్ ను ఆపే శక్తి వైఎస్ జగన్ కు మాత్రమే ఉందన్న ఈశ్వరి

చింతపల్లిః విశాఖ బాక్సైట్ గిరిజనుల హక్కు నినాదంతో చింతపల్లిలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అడవితల్లి బిడ్డలుగా బతుకుతున్న మన్యం ప్రజలను కనీసం మనుషులుగా కూడా చూడని నరరూపరాక్షసులంటూ టీడీపీ నేతలపై ఈశ్వరి మండిపడ్డారు. అత్యంత విలువైన ఖనిజ సంపదను దొంగలా దోచుకునేందుకు వస్తున్న  మోసగాడు, దగాకోరు, వెన్నుపోటు దారుడు చంద్రబాబు అంతు చూద్దామని గిరిజనులకు పిలుపునిచ్చారు.  

చంద్రబాబు ఖబడ్దార్ సవాల్ విసురుతున్నా.  బాక్సైట్ ను రెఫరెండంగా తీసుకో. నా ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేస్తాను. మీ అభ్యర్థిని నిలబెట్టు.  డిపాజిట్లు వస్తే నీను పూర్తిగా రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా. నేను గెలిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా చంద్రబాబు అంటూ గిడ్డి ఈశ్వరి సవాల్ విసిరారు. బాక్సైట్ జోలికొస్తే గిరిజన విల్లంబులతో తరిమికొడతామన్నారు.  చంద్రబాబు దమ్ముంటే మన్యానికి రావాలని.... గిరిజనులు ఏగతి పట్టిస్తారో చూద్దావుగానీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వెనుక ఉన్న మంత్రులు గుంటనక్కలని ఈశ్వరి ఫైరయ్యారు. గిరిజన మంత్రిగా ఉండి ఆదివాసీల్ని కించపరుస్తూ ,  నిధుల్ని దోచుకుంటున్నరావెల కిషోర్ బాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

గిరిజన ఓట్లతో గెలిచి తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన కొత్తపల్లి గీత కూడా వైఎస్సార్సీపీకి రాజీనామా చేయాలని ఈశ్వరి డిమాండ్ చేశారు. 
వైఎస్ జగన్ ను నమ్మబలికి వైఎస్సార్సీపీ నుంచి గెలిచి ఢిల్లీలో కూర్చొని గంజాయి మాఫియాలని మాట్లాడతావా అంటూ విరుచుకుపడ్డారు. దమ్ముంటే  చింతపల్లికి వచ్చి మాట్లాడు తిప్పితిప్పి తంతారు అని శివాలెత్తారు.  బాక్సైట్ ఆగ్రహానికి ఇక్కడి జనసందోహమే నిదర్శనమని...దాన్ని ఆపే శక్తి ఒక్క వైఎస్ జగన్ కు మాత్రమే ఉందన్నారు. 

గిరిజనులందరికి నేనున్నానంటూ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఆపద్బాంధవుడిగా నిలిచారన్నారు. ప్రతి నష్టంలో , కష్టంలో బాసటగా నిలుస్తున్న గిరిజన నేత  వైఎస్ జగన్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.  చింతపల్లి బహిరంగ సభ రాబోయే కాలంలో చరిత్రగా నిలుస్తుందన్నారు.  అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి చింతపల్లికి వచ్చిన  వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు.  

Back to Top