మోసం బాబుకు వెన్నతో పెట్టిన విద్య

అనంతపురం: మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్‌ అన్నారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నవరత్నాల సభ నిర్వహించారు. మండల కన్వినర్‌ తిరుమల వెంకటేషులు ఆధ్వర్యంలో జరిగిన సభకు ఉషాశ్రీచరణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ల వైయస్‌ఆర్‌ సీపీ అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుందన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు వందల కోట్లు వెదజల్లి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల ప్రయోజనాలను గడప గడపకూ తీసుకెళ్లాలని ఆదేశించారన్నారు. ఇందులో భాగంగానే బూత్‌ కమిటీ కన్వీనర్లు, కమిటీ సభ్యులను నియమించడం జరిగిందన్నారు. వైయస్‌ జగన్‌ను సీఎం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. సెప్టెంబర్‌ 5, 6న బూత్‌ కమిటీ సభ్యులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్‌లో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అక్టోబర్‌ 2 నుంచి 22 వరకు విజయశంఖారావం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Back to Top