సెల్ ఫోన్ నేనే తీసుకొని వచ్చా..!

హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
చెప్పే గొప్పలు అన్నీ ఇన్నీ కావని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్  అభివర్ణించారు. ఐటీ తానే కనిపెట్టా అంటారని,
సెల్ ఫోన్ తానే తెచ్చా అంటారని చురకలు అంటించారు. అసెంబ్లీలో బడ్జెట్ పద్దుల మీద
చర్చ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఐటీ పెట్టుబడులు
రూ. 3,533 కోట్లు అయితే, వైఎస్
హయాంలో  రూ. 13,250 కోట్లకు   అన్నారు. చంద్రబాబు హయాంలో ఐటీ ఎగుమతుల టర్నోవర్
రూ. 5,025 కోట్లు అయితే వైఎస్ హయాంలో రూ. 33,482 కోట్లు అని
స్పష్టం చేశారు. దీన్ని బట్టి ఐటీ ప్రగతి అర్థం అవుతుందని చెప్పారు.

చంద్రబాబు నాయుడు హయాంలో 85 వేల మంది
ఐటీ ఉద్యోగులు ఉంటే. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వారి సంఖ్య 2 లక్షలకు చేరుకుందని అన్నారు. తర్వాత మైనార్టీ పద్దుల గురించి మాట్లాడుతుంటే మంత్రులు అడ్డు తగిలారు.
Back to Top