నిస్సిగ్గుగా చంద్రబాబు కుల రాజకీయాలు

నంద్యాలః  ఆత్మీయ సమావేశాల పేరుతో నిస్సిగ్గుగా కులాలను ఉపయోగించుకోవడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని  వైయస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. మూడున్నరేళ్ల తర్వాత జరుగుతున్న ఈఎలక్షన్ లో  ప్రజలను మరోసారి మోసం చేసేందుకు బాబు కులాల వారిగా పాచికలు వేస్తున్నాడని ఫైర్ అయ్యారు. గత ఎలక్షన్ మేనిఫెస్టోలోనే వడ్డెరలు, కురుబ, బోయలను ఎస్సీ, ఎస్టీల్లో చేరుస్తానని చెప్పారని, మూడేళ్లదాటినా ఇంకా మాటలతో కాలయాపన చేస్తున్నాడని బాబుపై ధ్వజమెత్తారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు నిధులు, అధికారాలు ఇవ్వకుండా చేయడమే గాక....చైర్మన్ ను చంద్రబాబు ఏవిధంగా అవమానకరంగా తొలగించారో చూశామన్నారు.  కాపులను బీసీల్లో చేరుస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తుంటే...ఆయ్ను ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శాంతియుత పద్ధతుల్లో పాదయాత్ర చేస్తుంటే  ఇళ్లు దాటనీయకుండా అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తూ...నంద్యాలలో  కాపుల ఆత్మీయ సభలు అని పెట్టడం సిగ్గుచేటన్నారు.

 ఉపఎన్నిక సందర్భంగా కులాల వారిగా మంత్రులను, టీడీపీ నాయకులను దించి మభ్యపెట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారని అధికార టీడీపీపై నిప్పులు చెరిగారు. దుర్భర జీవితం గడుపుతున్న బుడగ జంగాలల పట్ల ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపుతోందని ప్రశ్నించారు.  నంద్యాలలో బుడగ జంగాలలు వేలసంఖ్యలో ఉన్నారని,  వాళ్ల కాలనీలకు వెళ్లి చూడాలని బాబుకు హితవు పలికారు. రెండుసార్లు అసెంబ్లీలో వైయస్సార్సీపీ  బుడగ జంగాలల తరపున లోతుగా చర్చ చేసిందన్నారు. ఆ సందర్భంగా ఎస్సీల్లో చేర్చడానికి పరిశీలిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకున్నదే లేదని అన్నారు.  ఇతర రాష్ట్రాల్లో బుడగ జంగాలనను ఎస్సీలుగా సర్టిఫికెట్లు ఇస్తుంటే బాబు ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. బుడగ జంగాలల సమస్యల పరిష్కారం కోసం వైయస్సార్సీపీ పోరాడుతుందని విశ్వేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. వైయస్ఆర్ హయాంలో ప్రత్యేకంగా 84 జీవో తీసుకొచ్చి ఆర్డీవో స్థాయిలో బుడగ జంగాలలకు  సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయం చేశారని విశ్వేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. 
Back to Top