వైయస్ఆర్ తో చంద్రబాబుకు పోలికా?

ఏపీ మర్యాదలను బాబు భ్రష్టుపట్టించారు
అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు
ఎన్ని పోరాటాలు చేసైనా రాష్ట్ర హక్కులను సాధించుకుంటాం
రాష్ట్రం బాగుపడాలంటే వైయస్ జగన్ సీఎం కావాలిః ఎమ్మెల్యేలు

పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి:
కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డితో చంద్రబాబుకు పోలికా అని పీఏసీ చైర్మన్, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ పాలనలో కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. కర్నూలులో వైయస్‌ జగన్‌ చేపట్టిన జలదీక్ష వేదిక వద్ద బుగ్గన మాట్లాడారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు.  నాడ నాయిబ్రహ్మణులకు ఆధరణ పథకంపేరుతో పెట్టే, కత్తెర, దువ్వెన ఇచ్చారని, రజకులకు ఇస్త్రీ పెట్టే ఇచ్చారన్నారు. వడ్డెర్లకు ఒక సుత్తే, రెండు ఉలులు ఇచ్చారని గుర్తు చేశారు. బేస్తలకు వల ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. కుల వృత్తులను చంద్రబాబు నాడు అవమానపరిచారని మండిపడ్డారు. అదే వైయస్‌ఆర్‌ హయాంలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు చేసి పేదల జీవితాలను తీర్చిదిద్దారని వివరించారు. 

చంద్రబాబు ప్రభుత్వం ఒక నియోజకవర్గానికి ముష్టిగా  1250 ఇళ్లు మాత్రమే కేటాయిస్తోందని, అలా చూస్తే ఒక్కో ఊరికి ఐదు ఇళ్లు మాత్రమే వస్తాయన్నారు. అది  కూడా జన్మభూమి కమిటీలకే పెత్తం కట్టబెట్టారని విమర్శించారు. అదే వైయస్‌ఆర్‌ హయాంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు నిర్మించారని గుర్తు చేశారు. నాడు చంద్రబాబు వ్యవసాయం దండగా అంటే వైయస్‌ఆర్‌ పండుగ చేశారని తెలిపారు. భావి తరాల కోసమే వైయస్‌ జగన్‌ జలదీక్ష చేస్తున్నారని తెలిపారు. చేనేత దీక్ష, రైతు దీక్ష, ఫీజు దీక్ష, జలదీక్ష వంటి పోరాటాలు చేసిన వైయస్‌ జగన్‌  ప్రభుత్వాల విధానాలను ఎండగట్టారని చెప్పారు.. పట్టిసీమతో రాయలసీమకు నీళ్లు ఇస్తామని చంద్రబాబు చెవిలో పువ్వులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో రాయలసీమ పేరు లేదన్నారు. వైయస్‌ జగన్‌ కర్నూలులో జలదీక్ష చేపడితే దేవుడు కూడా కరుణించాడన్నారు. మంచి పని చేస్తే దేవుడు కూడా సహకరిస్తారని చెప్పారు. చంద్రబాబు ఏమి చేసినా కూడా తత్కాలు టికెట్‌ తీసుకున్నట్లుగా ఉంటుందన్నారు. చంద్రబాబు పాలనలో ఫోటో గ్రాఫర్లు, జీరాక్స్‌ మిషన్లు పెట్టుకున్న వారు మాత్రమే బాగుపడ్డారని ఎద్దేవా చేశారు. 

చంద్రన్న కానుకల పేరుతో హెరిటేజ్‌కు ఆదాయం కట్టబెట్టారని ఫైర్‌ అయ్యారు. నిజాయితీ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అవినీతికి పాల్పడ్దారని ఆరోపించారు. అవినీతి డబ్బులతో పక్కరాష్ట్రంలో ఏపీ మర్యాదలను భ్రష్టుపట్టించాన్నారు. ఓటుకు కోట్లు కేసులో చిక్కి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తెలంగాణలో తాకట్టు పెట్టారని విమర్శించారు. కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండగా ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు కొంటున్నారని ప్రశ్నించారు.  శ్రీకృష్ణదేవరాయుల పాలన రావాలంటే వైయస్‌ జగన్‌ సీఎం కావాలని ఆకాంక్షించారు. 

ఆర్థిక సంక్షోభంలో ముంచి బాబు గొప్పలు చెప్పుకుంటున్నాడు
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి:
కర్నూలు: రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో ముంచి చంద్రబాబు అభివృద్ధి చేశానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని వైయస్‌ఆర్‌ సీపీ మహిళా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులతో ఆంధ్రరాష్ట్రానికి నీరు రాకుండా కుట్రలు జరుగుతుంటే చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు లోకేష్‌ను మంత్రిని, ముఖ్యమంత్రిని చేయడానికి ఉన్న ఆరాటం.. రాష్ట్ర ప్రజల సమస్యలపై ఎందుకు లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా టీడీపీ ప్రభుత్వం నిద్రపోతుంటే రైతన్నల కోసం.. నీటి కోసం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు వచ్చి ఉద్యమం చేస్తుంటే ...టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సిగ్గులేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను అన్ని వర్గాల ప్రజలను నిలువునా ముంచారని ధ్వజమెత్తారు. సొంత ప్రయోజనాలు, స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర హక్కులను చంద్రబాబు కాలరాస్తున్నాడని ఆమె దుయ్యబట్టారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఎన్ని పోరాటాలైనా చేసి రాష్ట్రానికి చెందాల్సిన హక్కులను సాధించుకుంటామని చెప్పారు. 

To read this article in English: http://bit.ly/1TgEghI 

Back to Top