చంద్రబాబు రాజకీయాలకు క్యాన్సర్- ఎమ్మెల్యే రోజా

హైదరాబాద్) రాజకీయాలకు పట్టిన చెద, క్యాన్సర్ అనేది చంద్రబాబే అని
వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా
అభివర్ణించారు. ఈ చెదను చికిత్స చేయకపోతే దేశానికి అంతా విస్తరిస్తుందని ఆమె వివరించారు.
హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 

లక్షా 34వేల కోట్ల అవినీతితో తండ్రీ,కొడుకులు రాష్ట్రాన్ని ఏవిధంగా
దోచుకుంటున్నారో అందరికీ తెలుసని ఆమె అన్నారు.  వీటి మీద పుస్తకాలు ప్రచురించి అందరికిపుస్తకాలిచ్చామని
రోజా వివరించారు. బాబు అవినీతి చూసి దేశంలో అందరూ నివ్వెరపోతున్నారని, అన్ని
పార్టీల వాళ్లు దీనిపై సీరియస్ గా చర్చ ప్రారంభించారని రోజా పేర్కొన్నారు.  నీతిమాలిన రాజకీయాలకు చంద్రబాబు  బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారని రోజా
మండిపడ్డారు. టీడీపీ మంత్రులు, ఎమెల్యేలు కల్లు తాగిన కోతుల్లా అవాకులు, చెవాకులు పేలుతున్నారని పేర్కొన్నారు.


 

 

Back to Top