బాబు అసత్య ప్రచారం వల్లే ఆర్థికసాయం అందడం లేదు

హైదరాబాద్ః ఏపీలో ఉన్న జీఎస్ డీపీ దేశంలో ఏ రాష్ట్రంలో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిథి పార్థసారథి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చెబుతున్న జీఎస్ డీపీకి, రాష్ట్రంలో వస్తున్న ఆదాయానికి పొంతనే లేదని పార్థసారథి అన్నారు. దేశ జీఎస్ డీపీకి 4 శాతంగా అదనంగా చూపిస్తున్నారని తెలిపారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేయడం వల్ల ఏపీ బలంగా ఉన్నందున ఆర్థికసాయం చేయకపోయినా పర్వాలేదన్న పరిస్థితికి కేంద్రప్రభుత్వం వచ్చే  ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రం బ్రహ్మాండంగా ఉందని ముఖ్యమంత్రి చెబుతుండడం వల్లే కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వడం లేదేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. 

Back to Top