డబ్బుతో గెలిచిన గెలుపు ఓ గెలుపేనా

ఏపీ అసెంబ్లీ: డబ్బుతో గెలిచిన గెలుపు కూడా ఓ గెలుపేనా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. మండలి ఎన్నికల ఫలితాలపై సోమవారం వైయస్‌ జగన్‌ స్పందించారు. చంద్రబాబు అద్భుతంగా కొనుగోళ్లు చేశారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి  ప్రజాప్రతినిధులను డబ్బులతో ప్రలోభపెట్టడంపై మండిపడ్డారు. కొనుగోలు పథకంలో చంద్రబాబు ఆరితేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top