తిరుపతి: అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్సీపీ నేత ప్రసాదరెడ్డిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకే హతమార్చారని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. రానున్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యుగమేనని ఆయన స్పష్టం చేశారు.<br/>ఆచార్య ఎన్జీ రంగా మనవరాలు బోయపాటి మమత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మమత చెప్పారు. ఈ సందర్భంగానే కరుణాకర్ రెడ్డి మాట్లాడారు.