చంద్రబాబు ప్రవర్తన బాధాకరం..!


() ఢిల్లీ పర్యటనల ఆంతర్యం ఏమిటి

() అన్నీ గ్రాఫిక్స్ బొమ్మలు చూపుతున్నారు

() అసెంబ్లీలో నిలదీసిన జన నేత

హైదరరాబాద్) రాజధానికి సంబంధించి చంద్రబాబు ప్రవర్తన బాధాకరంగా ఉందని
ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడా
సిన్సియారిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారు అని ఆయన అభిప్రాయ పడ్డారు. అసెంబ్లీ లో
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద వైఎస్ జగన్ మాట్లాడారు. ఆయన
ఏమన్నారో ఆయన మాటల్లోనే...!

“చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు పోతున్నాడో అర్థం
కావడం లేదు. ఓటుకు కోట్లు కేసుల్లో ఆడియా వీడీయో తో సహా పట్టుబడ్డాడు. ఆ కేసు నుంచి బయటపడడం
కోసం ఢిల్లీకి పోతున్నాడా. అక్కడకు పోయినప్పుడల్లా రాష్ట్రానికి అందాల్సిన నిధులను  తెస్తాడని చూస్తూనే ఉన్నాం.  అదే గుంటూరు జిల్లా వినుకొండలో 20 వేల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్స్
ఉన్నా అవి అవసరం లేదంటాడు. బాబుకు తన బినామీల కోసం ల్యాండ్ పూలింగే ముద్దు అంటాడు.
కేంద్రం వనరులు ఇస్తే చేయనంటాడు. సింగపూర్, చైనా, ఏదేశానికి పోతే ఆదేశంలా ఏపీని అభివృద్ధి చేస్తానంటాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లయిపోయింది. రాజధానిలో ఒక్క ఇటుక
వేయలేదు. ఫోటోలు చూపించి అదిగో బిల్డింగ్ ఇదిగో బిల్డింగ్ అని ఊరిస్తుంటారు.  చంద్రబాబు చేయడం లేదు సరికదా రెండేళ్లుగా తాము ఆ ఫోటోలు
చూస్తూనే ఉన్నాం. పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు విశాఖ కు రైల్వే జోన్, కడప స్టీల్  ప్లాంట్ ఇస్తామన్నారు. రైల్వో జోన్ ప్రస్తావన లేదు. పెట్రోకెమికల్
కాంప్లెక్స్ ఊసేలేదు. స్టీల్ ప్యాక్టరీ ఊసేలేదు. చంద్రబాబు మాత్రం అదిగో వస్తుంది.  ఇదిగో వస్తుంది అంటాడు. ఆయన తెస్తాడని చూడబట్టి రెండేళ్లయిపోయింది. ఈహామీల్లో ఏ ఒక్కటైనా చంద్రబాబు
సంతృప్తి కలిగేలా  చేశాడా అని అడుగుతున్నా.  బాబు కేంద్రాన్ని ఎందుకు నిలదీయటం
లేదు. 

కేంద్రానికి ఎందుకు అల్టిమేటం ఇవ్వలేదని అడుగుతున్నా.  కేంద్రమంత్రులను ఉపసంహరించుకుంటామని ఎందుకు చెప్పడం లేదు. బాబు ప్రవర్తిస్తున్న
తీరు చూస్తే బాధ అనిపిస్తోంది. ఎక్కడా సిన్సియారిటీ లేదు. ఇక్కడేమో బీద అరుపులు
అరుస్తాడు. అక్కడో  పిక్చర్ ఇస్తారు ’’
అని వైఎస్ జగన్ టీడీపీ వైఖరిని ఎండగట్టారు. 

       ఈ దశలో నోరెత్తలేని ప్రభుత్వం
ఎప్పటిలాగే మంత్రి అచ్చెన్నాయుడుని ముందుకు జరిపింది. అడ్డగోలు దూషణలకు
పాల్పడింది.

 

Back to Top