బాబుది శవరాజకీయం

కోవెలకుంట్ల: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని వైయస్‌ఆర్‌ సీపీ మండల ప్రధాన కార్యదర్శి అమడాల భాస్కర్‌రెడ్డి, బిజనవేముల ఎంపీటీసీ భీంరెడ్డి ప్రతాప్‌రెడ్డిలు ఆరోపించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులకు నిరసనగా గురువారం  స్థానిక గ్రామ పంచాయతీ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నానుద్ధేశించి వారు మాట్లాడుతూ ప్రతిపక్షనేతగా బస్సు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళితే అక్రమంగా కేసులు బనాయించడం విడ్డూరమన్నారు. దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాన్ని కాపాడేండుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశత్వ ధోరణితో పాలన కొనసాగిస్తోందన్నారు. బాధితుల పక్షాన నిలిచిన వైయస్‌ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం, దౌర్జన్యాలకు పాల్పడుతూ నీచ రాజకీయాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు జోళదరాశి రాంమోహన్‌రెడ్డి, అమడాల పుల్లారెడ్డి, రామసుబ్బారెడ్డి, చిన్నకొప్పెర్ల మోహన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, సూర్యశేఖర్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, జోళదరాశి పుల్లారెడ్డి, ఉసేనయ్య, కంబగిరి, సతీష్, నడిపెన్న, పుల్లయ్య, మహేష్, పీరా, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top