చంద్రబాబువి నీచ రాజకీయాలు

పొన్నూరుః ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైయ‌స్ఆర్‌ సిపి ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి డక్కుమళ్ళ రవి విమర్శించారు .వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నలుగురికి మంత్రి పదవులిచ్చి ముఖ్యమంత్రి ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగబద్దంగా విధులు నిర్వహించాల్సిన గవర్నర్‌ కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు.రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన గవర్నరే చివరకు ముఖ్యమంత్రి నీతిమాలిన నిర్ణయాలకు తలూపడం శోచనీయమన్నారు.ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి వైయ‌స్‌ఆర్‌ సిపి మనో ధైర్యాన్ని దెబ్బ తీయాలని సీఎం పన్నాగంగా కనపడుతోందని,ఇలాంటి చర్యలకు తమ పార్టీ ఏ మాత్రం చలించబోదని రవి స్పష్టం చేశారు.జనాభా ప్రాతిపదికన దళితులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మంత్రి మండలిలో ఇవ్వలేదన్నారు.ఒక్క దళిత మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా చంద్రబాబు తన దళిత వ్యతిరేకతను చాటుకున్నారని ఆయన ఆరోపించారు.

Back to Top