తూచ్‌..నోరు జారిన చంద్ర‌బాబు

విజయవాడ :అమరావతి శంకుస్థాపన సభలో తాను మాట్లాడేటప్పుడు.. ప్రత్యేక హోదా అనబోయి పొరపాటున ప్రత్యేక ప్యాకేజి అన్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రధానమంత్రికి చాలా స్పష్టంగా రిక్వెస్టు చేశానని అన్నారు. అన్ని విష‌యాలు చాలా  స్ప‌ష్టంగా చెప్పిన‌ట్లు విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ప‌దే పదే స్ప‌ష్టంగా చెప్పారు. 
ప్రత్యేక హోదా బదులు ప్యాకేజి ఇచ్చి సమన్యాయం చేయాలని కోరిన‌ట్లు అంత‌లోనే చెప్పుకొచ్చారు. వేదికపై పెద్దలంతా ఉన్నప్పుడు చాలా నియంత్రణతో మాట్లాడాలంటూ సూక్తులు వినిపించారు.  భావోద్వేగంతో ఒక్క మాట తప్పు మాట్లాడినా నెగెటివ్‌గా పోతుందంటూ క‌ల‌రింగు ఇచ్చారు. టెంపర్‌మెంట్‌కు భిన్నంగా ఎలా చేయాలో అలా చేశానని, ఎక్కడ చిన్న అపశృతి జరిగినా మొత్తం యజ్ఞానికే భంగం కలుగుతుందని చెప్పుకొచ్చారు. పవిత్ర కార్యక్రమంలో ఎలా బ్యాలెన్స్ చేయాలో అలా చేశానంటూ సెంటిమెంట్ జోడించారు. ప్రసంగంలో  స్పెషల్ స్టేటస్ అనబోయి స్పెషల్ ప్యాకేజి అన్నట్లు స‌ర్ది చెప్పారు. 
Back to Top