చంద్రబాబు కేటాయింపులన్నీ అన్యాయమే

బాబు నోట ఆ మాటలు వింటుంటే ఆశ్చర్యమేస్తోంది
ప్రాజెక్ట్ ల గురించి బాబు మాట్లాడడం విడ్డూరం
బాబు లష్కర్ లా వ్యవహరిస్తున్నాడు

హైదరాబాద్ః మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తిచేసిన ప్రాజెక్ట్ లను కూడా తానే చేశానని చంద్రబాబు చెప్పుకోవడంపై ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. చేయని పనులను చేసినట్లు చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ప్రాజెక్ట్ ల గురించి చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు వింటే ఆశ్చర్యమేస్తోందన్నారు. వరల్డ్ వాటర్ డే సందర్భంగా జరిగిన చర్చలో  వైఎస్ జగన్ బాబు పనితీరును ఎండగట్టారు. ప్రాజెక్ట్ లు కట్టిన వాడు గొప్పవాడో లేకపోతే ప్రాజెక్ట్ లు పూర్తి అయ్యాక  నీళ్లు ఉన్నప్పుడు గేట్లు ఎత్తే లష్కర్ గొప్పవాడో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రికి చురక అంటించారు. 

పులిచింతల, పోతిరెడ్డిపాడు, పోలవరం కుడికాలువ, తోటపల్లి, పుష్కరం, వంశధార, తాడిపూడి, గాలేరు నదరి, హంద్రీనీవా అంటూ బాబు ప్రాజెక్ట్ ల గురించి మాట్లాడడం ఆశ్చర్యకరమన్నారు. వంశధార ప్రాజెక్ట్  అంచనా వ్యయం రూ. 1242 కోట్లు అయితే...బాబు తన హయాంలో రూ. 44 కోట్లు పెట్టారన్నారు. మహానేత  వైఎస్సార్ తన హయాంలో రూ.657 కోట్లు వెచ్చించారని చెప్పారు. వైఎస్ మరణానంతరం 138 కోట్లు కేటాయింపులు జరిగాయన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.527 కోట్లయితే , వైఎస్సార్ హయాంలో రూ.398.88 కోట్లు కేటాయింపులు జరిగినట్లు పేర్కొన్నారు.  బాబు తన 9 ఏళ్ల పాలనలో కేవలం రూ. 3 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. అది కూడా నేనే శంకుస్థాపన చేసిన అని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరమన్నారు.   

పుష్కరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 608 కోట్లు అయితే, బాబు తన 9 ఏళ్ల కాలంలో కేవలం రూ.7.6 కోట్లు వెచ్చించారన్నారు. వైఎస్సార్ తన హయాంలో ప్రాజెక్ట్ కోసం రూ. 538 కోట్లు ఖర్చుపెట్టినట్లు చెప్పారు. వైఎస్సార్ మరణానంతరం రూ.61.77 కోట్లు కేటాయింపులు జరిగాయన్నారు. ఇక తాడిపూడి ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 467 కోట్లు అయితే, బాబు రూ.3.23 లక్షలు మాత్రమే కేటాయించారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో 384.64 కోట్లు వెచ్చించారని గుర్తు చేశారు. వైఎస్సార్ మరణానంతరం రూ. 55.19 కోట్లు ప్రకటించారన్నారు. 

వెంకటనగరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 124 కోట్లు అయితే, వైఎస్సార్ హయాంలో 75.54 కోట్లు కేటాయింపులు జరిగాయన్నారు. వైఎస్సార్ మరణానంతరం రూ.8.14కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. మూసురుమెళ్లి ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 207 కోట్లు అయితే, వైఎస్సార్ రూ. 148.97 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. వైఎస్ మరణానంతరం 44.58 కోట్లు ఖర్చు చేశారన్నారు. బాబు పెట్టింది సున్నా అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. భూపతి పాలెం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 146 కోట్లు అయితే వైఎస్సార్ హయాంలో రూ. 124.34 కోట్లు ఖర్చుచేశారు. బాబు కేవలం రూ.4.98 కోట్లు పెట్టారన్నారు. ప్రాజెక్ట్ లలో బాబు డొల్లతనం బయటపడుతుందని గ్రహించిన మంత్రులు మాటిమాటికి మధ్యలో లేస్తూ ప్రతిపక్ష నేత ప్రసంగానికి అడ్డుతగిలారు. 

స్పీకర్ మైక్ ఇవ్వకపోవడంపై వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు అవసరం లేకపోయినా, రేట్లు పెంచే వెసులుబాటు లేకపోయినా జీవో 22,63 జారీ చేసి కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చారని ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబు చేసిన కేటాయింపులు అన్యాయం, ముఖ్యమంత్రి అయ్యాక చేస్తున్న కేటాయింపులు అన్యాయమేనని నిలదీశారు. పట్టిసీమ ఖర్చును కూడా పోలవరం ప్రాజెక్ట్ కు పెడుతున్నారని, పట్టిసీమకు ఇంత ఖర్చుపెట్టామని చూపించుకోలేని అధ్వాన్నమైన స్థితిలో  ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. ఇవన్నీ అన్యాయం కాక మరేమిటని ప్రశ్నించారు. పోలవరం పూర్తయితే స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ పూర్తయితేనే వరద సమయాల్లో నీరు స్టోరేజ్ ఇవుతుంది. నీళ్లు లేని సమయాల్లో దిగువకు నీరు ఇవ్వవచ్చు. అప్పుడే కృష్ణాడెల్టా బాగుపడుతుంది. శ్రీశైలంకి నీరు ఇవ్వవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే .  గాలేరు నగరి, హంద్రీనీవాకు చంద్రబాబు చేసిన కేటాయింపులు దారుణంగా ఉన్నాయి. ఏరకంగా చూసినా అన్యాయమేనని జననేత ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. 
Back to Top