కడప : ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలి నియంత హిట్లర్ ను తలపిస్తోందని వైఎస్సార్ కడప జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. కడప జిల్లా కేంద్రంలో పార్టీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషాతోపాటు జిల్లా అధ్యక్షుడు అమర్నాధ్రెడ్డి, మేయర్ సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. శాసనసభ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం అహంకారపూరిత చర్యగా వారు అభివర్ణించారు. శాసనసభ కౌరవ సభను తలపిస్తోందని వారు ఆరోపించారు.